కృష్ణా.. కాల్వలో పడుతున్నాం.. | - | Sakshi
Sakshi News home page

కృష్ణా.. కాల్వలో పడుతున్నాం..

Mar 9 2025 1:36 AM | Updated on Mar 9 2025 1:35 AM

ప్రమాద సమయంలో భార్యతో ప్రవీణ్‌కుమార్‌ ఆఖరి మాటలు..

హనుమకొండ,

రాంనగర్‌

వరుసగా రెండు రోజులు సెలవులు. సరదాగా పిల్లలను తీసుకుని సొంతూరుకు బయలుదేరారు. కారులో భార్యాభర్తలు పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. నానమ్మ, తాతయ్య దగ్గరికి వెళ్తున్నామన్న ఆనందం మనుమరాలిది. కానీ విధి వక్రించింది. మార్గమధ్యలో కారు నడుపుతుండగానే ఇంటిపెద్దకు గుండెపోటు తీవ్రం కావడంతో నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. భర్త, కూతురు, రెండేళ్ల కుమారుడు జలసమాధి అయ్యారు. భార్య ప్రాణాలతో బయటపడినా ఒంటరిగా మిగిలిపోయింది. వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక గ్రామశివారులో శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది.

– పర్వతగిరి/సంగెం/నెల్లికుదురు

ఎస్సారెస్పీ కెనాల్‌లో పడిన కారు.. తండ్రి, ఇద్దరు పిల్లల మృతి

స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడిన తల్లి

వరుసగా సెలవులు రావడంతో స్వగ్రామానికి

కారులో వెళ్తున్న కుటుంబం

గుండెనొప్పి రావడంతో కారు స్టీరింగ్‌ తిప్పలేని పరిస్థితి..

నేరుగా కాల్వలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం

మేచరాజుపల్లిలో విషాదఛాయలు

11.40 గంటలకు : వరుసగా

సెలవులు రావడంతో

హనుమకొండలోని రాంనగర్‌లో

నివాసం ఉంటున్న సోమారపు ప్రవీణ్‌(28), భార్య కృష్ణవేణి, కూతురు చైత్రసాయి(5), కుమారుడు ఆర్యవర్ధన్‌(2)తో కలిసి హుందయ్‌ ఐక్రాస్‌ కారులో సొంత గ్రామమైన నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి బయలుదేరారు.

12.40 గంటలకు : అదే సమయంలో సమీపంలో ఉన్న చౌటపల్లికి చెందిన నవీన్‌, సందీప్‌, రవి వెంటనే కాల్వ వద్దకు చేరుకుని అలానే కాళ్లు ఆడించండి అని చెప్పి తాడు తీసుకువచ్చి కృష్ణవేణిని బయటకు తీశారు. ఇంతలో బాబు నీటిపై తేలుతుండడంతో అతడిని బయటకు తీశారు. కానీ, అప్పటికే చనిపోయాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండ డం, వెనక కూర్చున్న కూతురితో సహా తండ్రి కారులోనే నీటిలో మునిగిపోయారు.

1.10 గంటలకు : ఫైర్‌ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు పర్వతగిరి వైపు నీటిని ఎక్కువగా వదిలి.. వర్ధన్నపేట వైపు తగ్గించారు.

4.35 గంటలకు : నీటి ప్రవాహం తగ్గడంతో కారు కనిపించగా తాళ్లసాయంతో బయటికి లాగారు. కారు డ్రైవింగ్‌ సీట్లో ప్రవీణ్‌కుమార్‌, వెనుక సీట్లో కూతురు చైత్రసాయి విగతజీవులుగా బయటపడ్డారు.

వరంగల్‌ టు నెక్కొండ రోడ్డు

ఎస్సారెస్పీ కాల్వ

పర్వతగిరి రోడ్డు

12.25 గంటలకు : కారు మార్గమధ్యలోని సంగెం మండలం తీగరాజుపల్లి ఎస్సారెస్పీ కాల్వ (కొంకపాక గ్రామశివారు) దాటి 200 మీటర్లు ముందుకెళ్లాక ప్రవీణ్‌కుమార్‌ తనకు ఛాతిలో నొప్పిగా ఉందని భార్య కృష్ణవేణికి చెప్పాడు. దీంతో కారు కాసేపు ఆపారు. టీ తాగితే తగ్గుతుందని కృష్ణవేణి అనడంతో కారును వెనక్కి తిప్పి తీగరాజుపల్లి వైపు బయలుదేరారు.

12.30 గంటలకు : కారు వంద మీటర్ల ముందుకు రాగా, గుండెనొప్పి అధికం కావడం.. స్టీరింగ్‌ తిప్పే పరిస్థితి లేకపోవడంతో కృష్ణా(భార్యపేరును తలుస్తూ).. కాల్వలో పడిపోతున్నామంటూ ప్రవీణ్‌ చెప్పాడు. వెంటనే కృష్ణవేణి కారు డోర్‌ తెరిచి చేతిలో ఉన్న బాబును బయటకు విసిరివేసి వంగింది. అంతలోనే నీటి ప్రవాహంలో కృష్ణవేణి బయటకు వచ్చి కాళ్లు ఆడిస్తున్నది.

ప్రమాదం జరిగిందిలా..

(ప్రాణాలతో బయటపడిన కృష్ణవేణి, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు)

కృష్ణా.. కాల్వలో పడుతున్నాం..1
1/4

కృష్ణా.. కాల్వలో పడుతున్నాం..

కృష్ణా.. కాల్వలో పడుతున్నాం..2
2/4

కృష్ణా.. కాల్వలో పడుతున్నాం..

కృష్ణా.. కాల్వలో పడుతున్నాం..3
3/4

కృష్ణా.. కాల్వలో పడుతున్నాం..

కృష్ణా.. కాల్వలో పడుతున్నాం..4
4/4

కృష్ణా.. కాల్వలో పడుతున్నాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement