కానిస్టేబుల్ రాత పరీక్షకు "థర్డ్ జెండర్" | - | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ రాత పరీక్షకు "థర్డ్ జెండర్"

May 1 2023 2:01 AM | Updated on May 1 2023 2:06 PM

- - Sakshi

పోలీస్‌ కానిస్టేబుళ్ల తుది రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది.

వరంగల్: పోలీస్‌ కానిస్టేబుళ్ల తుది రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. స్టయిఫండరీ ట్రెయినీ కానిస్టేబుళ్ల నియామకంలో భాగంగా అభ్యర్థుల పరీక్ష కోసం వరంగల్‌, హనుమకొండ ప్రాంతాల్లో 16 సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 12,029 మంది అభ్యర్థులకు హాల్‌ టికెట్లు జారీ చేయగా 11,910 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ముగ్గురు థర్డ్‌ జెండర్లు ఉన్నారు.

ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు జరిగిన ఈ పరీక్ష కోసం అభ్యర్థులు ఉదయం 8 గంటల వరకే కేంద్రాలకు చేరుకున్నారు. పోలీస్‌ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది.. తనిఖీలు నిర్వహించి లోనికి అనుమతించారు. పరీక్ష ప్రశాంతంగా ముగియడానికి కృషిచేసిన పోలీస్‌ సిబ్బందిని సీపీ రంగనాథ్‌ అభినందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement