ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026

Jul 12 2026 1:17 AM | Updated on Jul 12 2026 1:17 AM

–8లోu పాఠశాల దశలోనే విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాల పెంపుపై ఫోకస్‌

న్యూస్‌రీల్‌

ఉమ్మడి

జిల్లాలో

ఇలా..

● అన్నాఅక్క మెంటార్‌షిప్‌ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఈనెల 1న ప్రారంభం కాగా, సెప్టెంబర్‌ వరకు కొనసాగనుంది.

● ఈ మెంటార్‌షిప్‌ వారానికి రెండు మూడు రోజుల పాటు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకా రం 30 గంటల మేర బోధించనున్నారు.

● ఉమ్మడి జిల్లాలో 14 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నా యి. అందులో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఐదో సెమి స్టర్‌ చదువుతున్న విద్యార్థులకు అన్నాఅక్క మెంటార్‌షిప్‌ టీచింగ్‌ లెర్నింగ్‌ ఇంటర్నెషిప్‌నకు అవకాశం కల్పించారు.

సాంకేతిక విద్యనందించాలని..

ప్రభుత్వ యూపీఎస్‌, హైస్కూల్‌ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలని ‘అన్నాఅక్క మెంటార్‌షిప్‌, టీచింగ్‌ ఇంటర్న్‌షిప్‌’ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఐదో సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలల్లోని 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, డిజిటల్‌ లెర్నింగ్‌, కంప్యూటింగ్‌, కోడింగ్‌, ఫైథాన్‌, జావా, గేమ్‌ డిజైన్‌ వంటి అనేక అంశాలపై బోధిస్తున్నారు.

మెంటార్లుగా డిగ్రీ విద్యార్థులు.. వీరికి ప్రత్యేక శిక్షణ

అభ్యాసకులు ప్రభుత్వ యూపీఎస్‌, హైస్కూళ్ల పిల్లలు

కృత్రిమ మేథ, డిజిటల్‌ లెర్నింగ్‌,

కోడింగ్‌ అంశాలపై అవగాహన

పిల్లల్లో స్నేహపూర్వక వాతావరణం

పెంపొందించేలా చర్యలు

స్నేహపూర్వక వాతావరణం..

చాలామంది విద్యార్థులు భయం, బెరుకు, స్పీకింగ్‌ ఫియర్‌ వల్ల క్లాస్‌రూమ్‌లో టీచర్‌ను సందేహాలు అడగకుండానే ఉండిపోతారు. అన్నాఅక్క మెంటార్‌షిప్‌లో భాగంగా విద్యార్థులకు, మెంటార్లకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. భయంలేకుండా సందేహాలు అడగడానికి అవకాశం ఏర్పడుతుంది. త్వరగా అర్థమయ్యే అవకాశం ఉంది. భవిష్యత్‌ మొత్తం ఏఐదే కాబట్టి బేసిక్‌ లెవెల్‌ నాలెడ్జ్‌ ఇంప్రూవ్‌ అవుతుందని అంచనా.

డిగ్రీ విద్యార్థులకు క్రెడిట్‌

డిగ్రీ విద్యార్థులు మెంటార్లుగా తెలంగాణ కోడ్‌మిత్ర పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. సర్టిఫికెట్‌ పొందారు. వీరికి శిక్షణ ఇచ్చారు. బోధన వల్ల వీరికి కమ్యూనికేషన్‌, టీచింగ్‌ స్కిల్స్‌ ఇంప్రూవ్‌తోపాటు మెంటార్‌షిప్‌ 30 గంటల పూర్తి చేసిన విద్యార్థులకు ఐదో సెమిస్టర్‌ ఫలితాల్లో ఒకటి లేదా రెండు క్రెడిట్‌ పాయింట్స్‌ కేటాయిస్తారు. ఇది వారికి ఒక ప్రాజెక్టుగా భావిస్తున్నారు.

ఇదొక అద్భుత అవకాశం

నేను హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్నాను. నేను డిగ్రీ చదువుతూ ఇలా హైస్కూల్‌ విద్యార్థులకు బోధించడం అద్భుత అవకాశంగా భావి స్తున్నా. నాలో బోధన నైపుణ్యాలు పెంచుకునే అవకాశం కలిగింది.

– బి.భార్గవి, బీసీఏ, ఫైనల్‌ ఇయర్‌, కేడీసీ హనుమకొండ

డిజిటల్‌

లెర్నింగ్‌

పుస్తకం

చదువుతున్న

విద్యార్థులు

సాంకేతిక అంశాలు

నేర్చుకుంటున్నాం..

అన్నాఅక్క మెంటార్‌షిప్‌లో భాగంగా ఏఐ, డిజిటల్‌ లెర్నింగ్‌, కోడింగ్‌ ఫైథాన్‌, జావా వంటి పలు అంశాలు చెబుతున్నారు. డిజిటల్‌ లెర్నింగ్‌కు సంబంధించిన పుస్తకాలు కూడా ఇచ్చారు. వీడియోలను ప్రదర్శిస్తూ బోధిస్తుండడంతో మాకు ఈజీగా అర్థమవుతోంది.

– ఎస్‌ ధనలక్ష్మి, తొమ్మిదో తరగతి, మర్కజీ హైస్కూల్‌, హనుమకొండ

నేర్చుకుంటూ బోధిస్తున్నా..

ఏఐ, డిజిటల్‌ లెర్నింగ్‌ తదితర అంశాలను నేను నేర్చుకుంటూ పైడిపెల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్నా. ఐపీఎఫ్‌ బోర్డు ద్వారా ఆయా సాంకేతిక అంశాలను వీడియోలో రూపంలో బోధిస్తుంటే విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు.

– ఎస్‌.రాజ్‌కుమార్‌, బీఏ,

కాకతీయ డిగ్రీ కళాశాల, హనుమకొండ

డిగ్రీ కళాశాల వారీగా ఎంపికైన

మెంటార్లు, స్కూళ్లు ఇలా..

మెంటార్లు స్కూళ్లు

భవిష్యత్‌లో ఎంతో

ఉపయోగం..

హనుమకొండ

జనగామ ఏబీవీ

పరకాల

ప్రభుత్వ

నర్సంపేట ప్రభుత్వ

పింగిళి

మహిళా

మహబూబాబాద్‌

ప్రభుత్వ

కాకతీయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement