ఆరోగ్య శాఖ మంత్రి పర్యటనకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య శాఖ మంత్రి పర్యటనకు ఏర్పాట్లు

Nov 26 2026 1:23 AM | Updated on Nov 26 2026 1:23 AM

జనగామ రూరల్‌: ఈ నెల 27న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. ఈమేరకు బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో సంబంధిత అధికా రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..మంత్రి పర్యటనలో భాగంగా ప్రభుత్వ వైద్య కళాశాల భవనం, అత్యవసర వైద్య చికిత్స కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలన్నారు. మంత్రి సందర్శన, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం కోసం కళాశాలలో ఒక ప్రత్యేక హాల్‌ను కేటాయించి, అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, కిరణ్‌ ప్రకాష్‌, మున్సిపల్‌ కమిషనర్‌లు రాజశేఖర్‌ రెడ్డి, రాధాకృష్ణ, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ సంపత్‌ రెడ్డి, తహసీల్దార్‌ మహిపాల్‌ రెడ్డి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా. శంకర్‌, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ నాగమణి, డీఎంహెచ్‌ఓ డా.వాణిశ్రీ, డీసీహెచ్‌ఎస్‌ డా. సంధ్య తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement