ఆధునిక పద్ధతులతో ఆయిల్‌పామ్‌ సాగు | - | Sakshi
Sakshi News home page

ఆధునిక పద్ధతులతో ఆయిల్‌పామ్‌ సాగు

Nov 26 2026 1:17 AM | Updated on Nov 26 2026 1:17 AM

జఫర్‌గఢ్‌: ఆయిల్‌పామ్‌, పుచ్చకాయ సాగులో రైతులు ఆధునిక, యాజమాన్య పద్ధతులను పాటించాలని జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ అధికారి నర్సయ్య కోరారు. మండలంలోని ఉప్పుగల్లు, స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని కోమటిగూడెం గ్రామాల్లో జిల్లా ఉద్యానవన పట్టపరిశ్రమ శాఖ అధికారి నర్సయ్య వివిధ ఉద్యాన పంటలను బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఉప్పుగల్లు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ తన వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తున్న ఆయిల్‌పామ్‌ సాగు విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు. వర్షాలు, మబ్బులతో కూడిన వాతవరణ పరిస్థితుల్లో పంటకు బూడిద, ఎండు తెగులు సోకే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి నర్సయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement