రఘునాథపల్లి: తెలంగాణ నీటి వాటాలను ఆంధ్రాకు కట్టబెట్టింది కేసీఆర్, హరీశ్‌రావులే అని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. బుధవారం మండలంలోని నిడిగొండ సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ విజయం సాధించి మూడేళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన ప్రగతి నివేదికను ఎంపీ కడియం కావ్య, పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. మూడేళ్లలో నియోజకవర్గంలో రూ.1,472 కోట్లతో అభివృద్ధి పనులు, మరో రూ. 150 కోట్ల చిన్న పనులతో కలిపి రూ.1,600 కోట్లతో పనులు చేపట్టామని, ప్రగతి నివేదకతో ఏం అభివృద్ధి చేశాననే వాళ్ల నోళ్లు మూతపడుతాయన్నారు. నివేదికలో పొందుపర్చిన ఏ ఒక్క అంశం నిజం కాదని నిరూపించినా, దేనికై నా సిద్ధమేనన్నారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారాలను కాంగ్రెస్ శ్రేణులు ఎప్పడికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా పలువురు జర్నలిస్టులు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించగా సీఎం దృష్టికి తీసుకెళతానని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిశీలకుడు శ్రీనివాస్ నాయుడు, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, కుడా చైర్మన్ గుండు సుధారాణి, ఇనుగాల వెంకట్రాంరెడ్డి, రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్, మాజీ జెడ్పీటీసీలు లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, గుడి వంశీధర్‌రెడ్డి, గాదె మహేందర్‌రెడ్డి, లింగాజీ, దిలీప్‌రెడ్డి, మేకల నరేందర్, కోళ్ల రవిగౌడ్, వేముల మల్లేష్, భాస్కర్‌యాదవ్, లోనె శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్, హరీశ్‌రావుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య ఫైర్
నియోజకవర్గ అభివృద్ధిపై
‘ప్రగతి నివేదిక’ ఆవిష్కరణ


