ఆంక్షలు.. అభ్యర్థులకు తిప్పలు | - | Sakshi
Sakshi News home page

ఆంక్షలు.. అభ్యర్థులకు తిప్పలు

Nov 14 2026 1:17 AM | Updated on Nov 14 2026 1:17 AM

హసన్‌పర్తి: డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ పరీక్షలు శుక్రవారం నిర్వహించగా.. మహిళా అభ్యర్థులకు విధించిన ఆభరణాల ఆంక్షలతో ఇబ్బందులు ఎదురయ్యాయి. వడ్డేపల్లి ఫిల్టర్‌ బెడ్‌ సమీపంలోని ఆయాన్‌ డిజిటల్‌ జోన్‌ ఆన్‌లైన్‌ సెంటర్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరైన మహిళా అభ్యర్థులకు ఆభరణాల నిబంధనలు ఇబ్బందికరంగా మారాయి. పరీక్ష కేంద్రంలోకి అనుమతించే ముందు మెడలోని చైన్‌, చెవుల కమ్మలు తదితర ఆభరణాలు తొలగించాలని నిర్వాహకులు సూచించారు. అయితే పరీక్షకు కుటుంబ సభ్యులు, సహాయకులతో కలిసి వచ్చిన మహిళలు తమ ఆభరణాల్ని వారి వద్ద భద్రపర్చారు. ఒంటరిగా వచ్చిన అభ్యర్థులకు మాత్రం ఇబ్బందులు తప్పలేదు. ఆభరణాలు ఎక్కడ భద్రపర్చాలో తెలియక ఆందోళనకు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement