నిండాముంచిన పత్తి | - | Sakshi
Sakshi News home page

నిండాముంచిన పత్తి

Nov 14 2026 1:17 AM | Updated on Nov 14 2026 1:17 AM

జఫర్‌గఢ్‌: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షభావ పరిస్థితులు, తెగుళ్లు బెడద మూలంగా మునుపెన్నడూ లేని విధంగా జిల్లాలో పత్తి సాగు దారుణంగా దెబ్బతింది. పంట దిగుబడి ఏమాత్రం లేక కనీసం పెట్టిన పెట్టుబడులైన రాక చేసిన అప్పులు ఏలా తీర్చాలో అర్థం కాక రైతులు తలలు బాదుకుంటున్నారు.

సాగు మొదట్లోనే..

ఎల్‌నినో ప్రభావం వల్ల పంట సాగు చేసిన మొదట్లోనే తీవ్ర వర్షభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పత్తి మొక్కల్లో సరైన ఎదుగుదల లేకుండా పోయింది. ఆ తర్వాత అడపదడపా వర్షాలు కురిసినా ఎండతీవ్రత, వాతావరణ పరిస్థితులతో పత్తి పంటకు తెగుళ్లు అశించాయి. కాత, పూత దశతో పాటు పంట చేతికి అందివచ్చే సమయంలో జాజూ రోగంతో పాటు ముడుత తదితర తెగుళ్లు ఆశించడంతో మొక్కలు ఎర్రబారి ఆకులు ముడతపోవ డం, కాయలు మురిగిపోయి నేలరాలాయి. తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడేందుకు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి రక రకాల పురుగుల మందులు కొట్టినా ఫలితం లేకుండా పోయింది.

ఎకరాకు రూ.30వేల వరకు పెట్టుబడి

పత్తి సాగు కోసం ఒక్కో ఎకరాకు దుక్కులు దున్నిన నాటి నుంచి మొదలుకొని ఎరువులు, పురుగుల మందులు, కూలీల ఖర్చులు కలుపుకొని సుమారు రూ.26వేల నుంచి 30 వేలకు వరకు పెట్టుబడులు పెట్టారు. ఒక్కో ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 3 నుంచి 4 క్వింటాళ్లు లోపు మాత్రమే దిగుబడి రావడంతో రైతులు నష్టపోయారు. ప్రభుత్వం ఇటీవల జిల్లాలోని జఫర్‌గఢ్‌ మండలాన్ని సాధారణ కరువు ప్రాంతంగా ప్రకటించడంతో పాటు 33 శాతం కంటే ఎక్కువగా దెబ్బతిన్న పంటలపై సర్వే నిర్వహించాలని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే పత్తి పంట ఏరివేత దాదాపుగా పూర్తి కావస్తుండడంతో దెబ్బతిన్న పత్తి పంటను అంచనా వేసే పరిస్థితి లేదు. దీంతో పంట నష్టపోయిన పత్తి రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందే అవకాశం కన్పించడం లేదు.

పంటను దెబ్బతీసిన వర్షభావ

పరిస్థితులు, అధిక తెగుళ్లు

కేవలం 3 నుంచి 4 క్వింటాళ్ల లోపు దిగుబడి

రైతులకు పెట్టుడులు కూడా రాని పరిస్థితి

పంట నష్ట పరిహారం

అందించాలంటున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement