నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక | - | Sakshi
Sakshi News home page

నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక

Nov 14 2026 1:17 AM | Updated on Nov 14 2026 1:17 AM

జనగామ రూరల్‌: రాబోయే యాసంగి 2026–27 సీజన్‌న్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల సాగు ప్రణాళిక రూపొందించాలని, రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు సూచించారు. శుక్రవారం హైదారాబాద్‌ నుంచి కలెక్టర్లతో వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, విద్యాశాఖ, భూసేకరణ, వీధి కుక్కల నియంత్రణ, వీబీ జీరాంజీ పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్‌న్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ..ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేనందున వరి సాగును నివారించాలని రైతులను ఉద్యాన పంటలు, ఆయిల్‌ పామ్‌ సాగు వైపు మళ్లించాలని, సూక్ష్మ సేద్య విధానాలను ప్రోత్సహించాలని తెలిపారు. కనీస మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం విక్రయించి రైతులు నష్టపోకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో నీటి సంరక్షణ నిర్మాణాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థులు, సిబ్బంది హాజరు ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా వంద శాతం నమోదయ్యేలా చర్యలు తీసు కోవాలన్నారు. వీసీలో డీఎంహెచ్‌ఓ వాణిశ్రీ, విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్‌, డీఏఓ అంబికా సోని, డీవీహెచ్‌ఓ మురళీధర్‌ రావు, డీపీఓ వెంకట్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement