20వ తేదీలోపే జాతర పనులు పూర్తికావాలి | - | Sakshi
Sakshi News home page

20వ తేదీలోపే జాతర పనులు పూర్తికావాలి

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

● జీడికల్‌ రామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్ష

లింగాలఘణపురం: ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే జీడికల్‌ వీరాచల రామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల జాతర పనులన్నీ 20వ తేదీలోపు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశించారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో జాతర పనులపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జీడికల్‌ – జనగామ రోడ్డు పనులు రూ.8 కోట్లతో మంజూరైనప్పటికీ ఎన్నో ఏళ్లుగా వివిధ కారణాలతో పనులు కావడంలేదని, ఆ రోడ్డు పనులు కూడా 20 వరకు పూర్తి చేయాలని పీఆర్‌ ఈఈ శ్రీనివాస్‌ను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో 500 మీటర్ల సీసీ రోడ్డు, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌, గ్రీనరీ, భక్తులకు శాశ్వతంగా నిర్మించే సామూహిక మరుగుదొడ్ల పనులను 15 వరకు పూర్తి చేయాలని అన్నారు. కలెక్టర్‌ ప్రత్యేక నిధులతో రూ.31 లక్షలు మంజూరు చేశారని, దీంతో ఉద్యానవన శాఖ, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌ పనులు చేయాలన్నారు. సమావేశంలో సర్పంచ్‌ కె.మమతసంపత్‌, డీసీపీ రాజమహేంద్రనాయక్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సంపత్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ శ్రీవాణి, తహసీల్దార్‌ అండాలు, స్టేషన్‌ఘన్‌పూర్‌ హెచ్‌ఓ సందీప్‌, ఈఓ వంశీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement