మళ్లీ పుంజుకున్న ధాన్యం ధరలు | - | Sakshi
Sakshi News home page

మళ్లీ పుంజుకున్న ధాన్యం ధరలు

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

జనగామ: వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం ధాన్యం కొనుగోళ్లు భారీగా జరిగాయి. సన్న, దొడ్డు తదితర రకాల ధాన్యాన్ని 152 మంది రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్కెట్‌లో 5,289 (8,173) క్వింటాళ్ల ధా న్యం కొనుగోలు చేశారు. వారం రోజుల క్రితం క్వింటాలుకు రూ.200 నుంచి రూ.300 వరకు తగ్గిన ధరలు ప్రస్తుతం మళ్లీ పుంజుకుంటున్నాయి. ప్రైవేట్‌ మార్కెట్‌లో కొనుగోళ్లు పెరగడంతో ధరలకు ఊపొస్తోంది. మార్కెట్‌లో సన్నరకం ధాన్యం క్వింటాలుకు గరిష్టంగా రూ.2,601, దొడ్డు రకం రూ. 2,319, కనిష్టంగా రూ.1,911, మోడల్‌ ధర రూ.2,110 పలి కింది. ఆర్‌ఎన్‌ఆర్‌ రకం రూ.2,651 ధరకు అమ్ముడుపోయింది. ధరలు పెరుగుతుండటంతో రైతుల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది.

ఆర్టీసీలో పర్యవేక్షణ డొల్ల

● టికెట్‌ కలెక్షన్‌పై కొరవడిన నిఘా

జనగామ: ఆర్టీసీ డిపోలో విధులు ముగించుకున్న కండక్టర్‌ టికెట్‌ కలెక్షన్‌ నగదును ఎస్‌ఆర్‌ఓ బృందానికి అప్పగించకుండా ట్రంకుపెట్టెలోనే ఉంచి వెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 19న రూట్‌పైకి వెళ్లిన బస్సు 20న డిపోకు చేరుకోగా, రూట్‌వారీ టికెట్‌ కలెక్షన్‌ నగదును ఎస్‌ఆర్‌ఓ బృందం సేకరించకుండానే కండక్టర్‌ ట్రంకుపెట్టెలో ఉంచినట్లు తెలిసింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు కూడా గుర్తించకపోవడం పర్యవేక్షణ లోపాలను ఎత్తి చూపుతోంది. ఆలస్యంగా విషయం గుర్తించిన డిపో ఉన్నతాధికారులు కండక్టర్‌కు ఫోన్‌ చేయడంతో ఆయన వచ్చి నగదును కౌంటర్‌లో చెల్లించారు. బస్సులు డిపో కు చేరినప్పుడు పర్యవేక్షించాల్సిన డీసీ ఎర్నింగ్స్‌ అధికారులు ఏం చేశారనే చర్చ జరుగుతోంది. కేవలం కండక్టర్‌నే బాధ్యుడిని చేసి, పర్యవేక్షణ అధికారులను కాపాడే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై విచారణ కొనసాగుతోందని, పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని డిపో మేనేజర్‌ ఉష తెలిపారు.

న్యాప్కిన్‌ వెండింగ్‌,

ఇన్సినరేటర్‌ మిషన్ల ఏర్పాటు

జనగామ రూరల్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు వారి ఆరోగ్యంపై ఇంటర్‌ బోర్డు దృష్టి సారించింది. విద్యార్థినులు నెలసరి సమయంలో ఇబ్బంది పడకుండా ఉండాలని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో శానిటరీ న్యాప్కిన్‌ వెండింగ్‌, ఇన్సినరేటర్‌ మిషన్లను ఏర్పాటు చేసింది. వాష్‌రూముల్లో వీటిని ప్రత్యేకంగా బిగించారు. మిషన్‌లోని బటన్‌ నొక్కి న్యాప్కిన్లను తీసుకోవచ్చు. వినియోగించిన ప్యాడ్లను గోప్యంగా పర్యావరణహితం కోసం ఇన్సినరేటర్‌లో పడేసి బూడిద చేయవచ్చు. మిషన్‌ వినియోగంపై విద్యార్థినులకు అవగా హన కల్పించారు. జిల్లాలో 7 ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలు ఉండగా, ఇందులో 1000 మందికిపైగా బాలికలు చదువుతున్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు ఇంటర్‌ విద్య కోసం వచ్చే విద్యార్థినులు ఇబ్బంది లేకుండా శానిటరీ న్యాప్కిన్‌ వెండింగ్‌, ఇన్సినరేటర్‌ మిషన్‌ ఉపయోగపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement