ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులా? | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నించే గొంతుకలపై అక్రమ కేసులా?

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

జనగామ: ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే బీఆర్‌ఎస్‌ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల మాంసాభివృద్ధి కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు.. బాలరాజు యాదవ్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో నిర్బంధాలు, అణచివేతలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వాన్ని నిలదీసే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేయడం నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నా రాహుల్‌ గాంధీకి కనిపించడం లేదా అని, ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రశ్నించే వారిని అరెస్టు చేయడమేనా అని విమర్శించారు. బాలరాజు యాదవ్‌పై నమోదు చేసిన కేసులను తక్షణమే ఎత్తివేసి భేషరతుగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

బాలరాజు యాదవ్‌ అరెస్టును

ఖండించిన ఎమ్మెల్యే పల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement