టపాసులు, పూజాసామగ్రి, కొత్త బట్టల కొనుగోళ్లు
జనగామ: దీపావళి పండుగ ఒక్కరోజే ఉండటంతో జిల్లాలో కొనుగోళ్ల సందడి ఊపందుకుంది. పండుగకు అవసరమైన టపాసులు, పూలు, పూజాసామగ్రి, నోములకు సంబంధించిన వస్తువులు, పిండి వంటల తయారీకి అవసరమైన కిరా ణా సరుకులు, కొత్త బట్టల కొనుగోలుతో మార్కె ట్లు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు భవిష్యత్తులో కరువు పరిస్థితులు ఏర్పడవచ్చన్న ప్రచారం, ఆర్థిక ఇబ్బందుల భయంతో కొన్ని కుటుంబాలు పొదుపు మంత్రం పాటిస్తున్నాయి. గతంతో పోలిస్తే టపాసుల వ్యాపారం 10 నుంచి 20 శాతం మేర తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్లో వివిధ రకాల కొత్త వైరెటీ టపాసులు అందుబాటులోకి వచ్చాయి. రూ.10 నుంచి రూ.2 వేలకుపైగా ధరలతో వివిధ రకాల టపాసులు విక్రయిస్తున్నారు. చిన్నపిల్లల కోసం రూపొందించిన బాణసంచా కూడా అందుబాటులో ఉంది.
పూలు, పూజాసామగ్రికి డిమాండ్
దీపావళి పూజల్లో బంతిపూలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఇళ్ల అలంకరణ, లక్ష్మీపూజ కోసం బంతిపూల కొనుగోళ్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం కిలో బంతిపూలు రూ.100 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు. పూలతో పాటు పూజాసామగ్రి, నోములకు అవసరమైన వస్తువులు, ఇతర పండుగ సరుకులకు కూడా గిరాకీ పెరిగింది. కాగా, దీపావళిని పురస్కరించుకుని ఇళ్లు, దుకాణాలు రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించి పండుగకు సిద్ధం చేస్తున్నారు.
సంప్రదాయ వైభవం
మధ్యాహ్నం 2 గంటల నుంచి నోముకోవచ్చు
● అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకుడు కాసోజు రాజేశ్వరచార్యులు
జనగామ: దీపావళిని పురస్కరించుకుని కేదారేశ్వర నోములు నోముకోవచ్చని అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకుడు కాసోజు రాజేశ్వరచార్యులు వెల్లడించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఆశ్వయుజ బహుళ అమావాస్యను పురస్కరించుకుని 8న (ఆదివారం) కేదారేశ్వర నోములు నోముకోవాలని సూ చించారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎప్పుడైనా ఈ నోముకు అనుకూలమైన సమయమని పేర్కొన్నారు. నోముల ఉద్వాసనను 9వ తేదీన ఉదయం 11:31 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:35 నిమిషాల లోపు లేదా మధ్యాహ్నం 3:16 నిమిషాల నుంచి సాయంత్రం 5:33 నిమిషాల లోపు కదిలించుకోవాలని తెలిపారు. ఈ సంవత్సరం స్వాతి నక్షత్రంతో కూడిన అమావాస్య వస్తున్నందున గత సంవత్సరం అనివార్య కారణాలతో నోములు నోముకోలేని వారు వాకిలి ద్వారబంధనం చేసుకుని యథాతథంగా ఈ నోమును ఆచరించవచ్చని తెలిపారు. ఈ సంవత్సరం స్వాతి నక్షత్రంతో కూడిన స్వాతి కార్తె లేనందున కొత్తగా నోములు తీసుకుని నోముకోవడానికి వీలు లేదన్నారు.
ప్రమిద
కాంతుల్లో
జనగామ: చీకటిని పారదోలుతూ వెలుగులు నింపే దీపావళి పర్వదినానికి మట్టి ప్రమిదలు మరింత అందాన్ని తీసుకొస్తున్నాయి. సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ప్రమిదలు పల్లెలు, పట్టణాల్లో వివిధ ఆకృతులు, రంగులతో కనువిందు చేస్తున్నాయి. చిన్నవి, పెద్దవి, పూల ఆకృతులు, ప్రత్యేక డిజైన్లతో తయా రైన ప్రమిదలు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇంటి ముంగిళ్లు, వాకిళ్లు, దేవాలయాలు దీపాల వెలుగులతో కళకళలాడేందుకు ప్రజలు మట్టి ప్రమిదలను కొనుగోలు చేస్తున్నారు.


