● డోర్లు ఏర్పాటు చేసినంత మాత్రాన సమస్య సమసిపోదని, వాటిని నిరంతరం మెయింటెయిన్ చేయాలని సూచిస్తున్నారు.
● గ్యారేజీలో ప్రతీరోజు మెకానిక్‌లు డోర్లను తనిఖీ చేసి లోపాలుంటే సరిదిద్దాల్సి ఉంటుంది. మెకానికల్ డోర్లు కండక్టర్లు మూసివేయాల్సి ఉంటుందని, ఇది కొంత అసౌకర్యకరంగా ఉంటుందని చెబుతున్నారు.
● ఏసీ, సూపర్ లగ్జరీ, ఎలక్ట్రిక్ బస్సుల మాదిరిగా ఎయిర్ సస్పెన్షన్‌తో పనిచేసే న్యూమాటిక్ డోర్లు ఏర్పాటు చేస్తే డ్రైవర్ వాటిని ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది. కండక్టర్ టికెట్లు ఇస్తున్నా.. డ్రైవర్ తానే డోర్ వేయడం, తెరవడం జరుగుతుంది.
● ఆర్టీసీ యాజమాన్యం అన్ని బస్సులకు న్యూమాటిక్ డోర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, అప్పుడే సంస్థ ఆశించిన భద్రత లక్ష్యం నెరవేరుతుందంటున్నారు.
బస్సుల డోర్‌ల పరిస్థితి..
పనిచేస్తున్నవి 80%
లేనివి 20%
● అధికారులు గుర్తించినవి.


