త్వరితగతిన పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

త్వరితగతిన పరిష్కరించాలి

Sep 29 2026 1:03 AM | Updated on Sep 29 2026 1:03 AM

● గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశం

● ప్రజల నుంచి 371 దరఖాస్తుల స్వీకరణ

జనగామ రూరల్‌: కలెక్టర్‌ కార్యాలయంలోని మెయిన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు. ప్రజా వాణిలో ఎక్కువగా భూ, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్‌ సమస్యలే ఉన్నా యి. ప్రజలు అందజేసిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి 371 అర్జీలను కలెక్టర్‌ స్వీకరించారు. వచ్చిన దరఖాస్తుల ను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. డీఆర్డీఓ భాస్కర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ రెడ్డి, సీపీఓ చిన కోట్యానాయక్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

దరఖాస్తుల్లో కొన్ని..

పట్టణంలోని 11వ వార్డు వీవర్స్‌ కాలనీ చెందిన కందగట్ల మధుసూదన్‌, తమ వీధిలో డ్రెయినేజీ కాలువ, సీసీ రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నారని, మురుగు కాలువ, సీసీ రోడ్డు నిర్మాణం చేసి ప్రజలను ఆదుకోవాలని కలెక్టర్‌కు దరఖాస్తు అందజేశారు.

జఫర్‌గఢ్‌ మండల తిడగు గ్రామానికి చెందిన వాసం వెంకటేశ్వర్లు తమకు రెండు ఎకరాల ఎనిమిది గుంటల భూమి వంశపారపర్యంగా సంక్రమించిందని, సంబంధిత భూమి ఇతరుల పేరిట రెవెన్యూ రికార్డుల్లో వస్తోందని, దానిని తొలగించి, తమ పేరును ఆన్‌లైన్‌లో నమోదు చేసి పట్టా పాసుబుక్‌, పహాణీలు అందజేయాలని కోరారు.

బచ్చన్నపేట మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన బండి వనజ, గతంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు అందజేయగా ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు కాలేదని తన దరఖాస్తును పరిశీలించి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు.

లింగాల ఘణపురం మండలం వడిచెర్ల గ్రామం చెందిన బొట్ల అనసూర్య, తనది పేద కుటుంబం అని, కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నారని, భూమి జాగా ఏమీ లేదని, ఉన్న ఇల్లు శిథిలావస్థలో ఉందని, ఇందరిమ్మ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను వేడుకుంది.

జనగామ మండలం సిద్ధెంకి గ్రామానికి చెందిన నీలగిరి భిక్షపతి, తన రెండు ఎకరాల ఐదు గుంటల భూమిని ఆన్‌లైన్‌ రికార్డుల్లో నమోదు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశాారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement