కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధిపథంలో గ్రామాలు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధిపథంలో గ్రామాలు

Sep 30 2026 2:04 AM | Updated on Sep 30 2026 2:04 AM

లింగాలఘణపురం: కాంగ్రెస్‌ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం మండలంలోని వనపర్తిలో రూ.10 లక్షల సీసీ రోడ్లు, కొత్తపల్లిలో రూ.37.50 లక్షల సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. వనపర్తిలో మరో రూ.20 లక్షల సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ముఖ్యఅతిథిగా మాట్లాడారు.. బీఆర్‌ఎస్‌, బీజేపీ అధికారం కోసం విషం చిమ్ముతున్నాయని, వారికి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. సమావేశాల్లో సర్పంచ్‌లు వంచ శైలజ ఉపేందర్‌రెడ్డి, విష్ణు, తహసీల్దార్‌ ఆండాలు, ఎంపీడీఓ శివశంకర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ శివకుమార్‌, పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌మనోహర్‌, మాజీ జెడ్పీటీసీ, జిల్లా ఉపాధ్యక్షుడు వంశీధర్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

జిల్లా విద్యుత్‌ ఉద్యోగుల యూనియన్‌ కార్యవర్గం

జనగామ: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బి.వీరాంజనేయులు, కార్యదర్శిగా చెట్టిపల్లి నరేందర్‌రెడ్డి, సీనియర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బి.రాజ్‌కుమార్‌, కోశాధికారిగా కె.నారోత్తంరెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ ఇనుగాల శ్రీధర్‌, కంపెనీ అధ్యక్షుడు మహేందర్‌ రెడ్డి, రాష్ట్ర సీనియర్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఐలేష్‌ తదితరులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంఘం అభివృద్ధిపై నాయకులు చర్చించారు. కార్యక్రమంలో జనగామ అధ్యక్షు డు మూల మహేందర్‌, కార్యదర్శి కోతి విజయ్‌ కుమార్‌, కోశాధికారి బి.యాకయ్య, ఘన్‌పూర్‌ నాయకులు శ్రీధర్‌, ఫయాజ్‌, కృష్ణరాజు, కంపెనీ జాయింట్‌ సెక్రటరీ బి.ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ జి.రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సంపత్‌రెడ్డిని నూతన కమి టీ మర్యాద పూర్వకంగా కలిసింది.

50 ప్రగతినగరాల్లో

ఓరుగల్లుకు చోటు

వరంగల్‌ అర్బన్‌: దేశవ్యాప్తంగా ఉన్న 50 ప్రగతినగరాల్లో ఓరుగల్లు ఒకటిగా నిలిచింది. రాష్ట్రంలో హైదరాబాద్‌, వరంగల్‌కు చోటు లభించింది. ఈ మేరకు మంగళవారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ 50 ప్రగతి నగరాల వివరాలను వెల్లడించారు. సాలిడ్‌ వేస్ట్‌మేన్‌జ్‌మెంట్‌ రూల్స్‌–2026కు అనుగుణంగా నాలుగు రకాల వ్యర్థాలను మూలస్థాయిలోనే వేర్వేరుగా సేకరించాలని సూచించారు. పారిశుద్ధ్య సమస్యలు, ఫిర్యాదులను సులభతరం చేయడం, వాట్సాప్‌ ఆధారిత ప్రజా ఫిర్యాదుల వ్యవస్థకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర మంత్రి వివరించారు. నగరాల పరిశుభ్రతను మరింత మెరుగుపరచడంతో పాటు ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హనుమకొండలోని కమిషనర్‌ క్యాంపు కార్యాలయం నుంచి గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ టి.వెంకన్న, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు ‘డయల్‌ యువర్‌ డీఎం’

హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు, సలహాలు సూచనలు స్వీకరించడానికి బుధవారం డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్‌–1 డిపో మేనేజర్‌ పుప్పాల అర్పిత తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హనుమకొండలోని వరంగల్‌–1 డిపో నుంచి డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల తదితర రూట్ల ప్రయాణికులు 9959226047 నంబర్‌కు ఫోన్‌చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని, సమస్యలు చెప్పాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement