రెడ్‌క్రాస్‌ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి

Sep 30 2026 2:04 AM | Updated on Sep 30 2026 2:04 AM

● కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

జనగామ రూరల్‌: జిల్లాలో రెడ్‌క్రాస్‌ సంస్థ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా నూతనంగా ఎన్నికైన మేనేజింగ్‌ కమిటీ సభ్యులకు సూచించారు. సోమవారం రాత్రి కలెక్టర్‌ను కొత్త కమిటీ సభ్యులు ఆయన్ను కలిశారు. ఈసందర్భంగా వారితో కలెక్టర్‌ మాట్లాడుతూ.. మూడోసారి చైర్మన్‌గా ఎన్నికై న డా. లవకుమార్‌ రెడ్డిని అభినందిస్తూ జిల్లాలో రెడ్‌క్రాస్‌ సొసైటీని బలోపేతం చేయాలన్నారు. జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీకి 15 మంది మేనేజింగ్‌ కమిటీ సభ్యులు ఎన్నిక కావాలని ఇందుకోసం 17 మంది సభ్యులు నామినేషన్‌ పత్రాలు ఎన్నికల అధికారి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఆర్డీఓ ఎస్‌.కిరణ్‌ ప్రకాశ్‌కు సమర్పించారు. ఏకగ్రీవం కావడానికి అనుగుణంగా కన్న పరశురాములు, కృష్ణజీవన్‌ బజాజ్‌ పోటీ నుంచి ఉపసంహరించుకోవడంతో మేనేజింగ్‌ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. వెంటనే ఆఫీసు బేరర్స్‌ ఎన్నిక నిర్వహించి పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి ప్రకటించారు. కలెక్టర్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరించే ఈ కార్యవర్గంలో చైర్మన్‌గా డా. డి.లవకుమార్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా ఇ.ప్రభాకర్‌ రెడ్డి, కోశాధికారిగా గాదె క్యాథరిన్‌, రాష్ట్ర ఎం.సి. సభ్యుడిగా దొంతుల శేఖర్‌, మేనేజింగ్‌ కమిటీ సభ్యులుగా వేమల్ల నరసింహ రెడ్డి, ఎస్‌.శివరాజ్‌ యాదవ్‌, సీహెచ్‌ సురేందర్‌ రెడ్డి, పి.సత్యం, బి.రజినీ, జైన రమేశ్‌, పప్పు వెంకట్‌ రెడ్డి, పి.శ్రీనివాస్‌, పేర్వారం ప్రభాకర్‌, ఎ.హేమంత్‌రాజ్‌, ఎం.ఆంజనేయులు ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement