దక్షిణ భారత బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

దక్షిణ భారత బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌లో ప్రతిభ

Sep 30 2026 2:04 AM | Updated on Sep 30 2026 2:04 AM

జనగామ రూరల్‌: జిల్లా కేంద్రంలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఈనెల 16 నుంచి 19 వరకు బెంగళూరులో జరిగిన 1వ సౌత్‌ ఇండియా బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌–2026లో రాష్ట్రం తరపున పాల్గొని కాంస్య పతకాలు సాధించారు. కళాశాలకు చెందిన తృతీయ సంవత్సరం బీఏ విద్యార్థినులు రమావత్‌ సాయి ప్రణతి 45–48 కేజీలు, అంజలి కొర్ర 65–70 కేజీల విభాగాల్లో ప్రతిభ కనబరిచారు. కళాశాల ప్రిన్సిపాల్‌ కె.శ్రీనివాస్‌, బీఏ విభాగాధిపతి జె. శ్రీదేవి, ఏఓ రాజ్‌ కుమార్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ కళ్యాణి విద్యార్థినులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement