8 అంతస్తుల్లో ఓపీ సేవలు! | - | Sakshi
Sakshi News home page

8 అంతస్తుల్లో ఓపీ సేవలు!

Sep 30 2026 2:04 AM | Updated on Sep 30 2026 2:04 AM

● ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

● సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణ పనులు వేగవంతం

కాశిబుగ్గ: వరంగల్‌లో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో మొదటి విడత ఓపీ సేవలు అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం 8 అంతస్తుల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. డీఎంఈ డాక్టర్‌ వాణి, వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద పర్యవేక్షణతో పాటు సీఎంఓ అఽధికారుల చొరవతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కానీ, దసరా వరకు పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అధికారులు ఒకడుగు ముందుకు వేసి ప్రాథమిక దశలో ఓపీ సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు.

ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్య సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దసరా వరకు ఓపీ సేవలు, అత్యవసరమైన ఎక్స్‌రే, ల్యాబ్‌, ఈసీజీ, డ్రెస్సింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓపీలో వైద్యపరీక్షల అనంతరం పేషెంట్లను అడ్మిట్‌ చేయాల్సి వస్తే వారిని ఎంజీఎంకు ఎలా తీసుకెళ్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎంజీఎం అంబులెన్స్‌లను ఉపయోగిస్తారా, ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవల వివరాలను చెప్పడానికి ఎంజీఎం అధికారులు ఆసక్తి చూపడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement