మంత్రులు పొన్నం, వివేక్‌కు దర్రీస్‌ బహూకరణ | - | Sakshi
Sakshi News home page

మంత్రులు పొన్నం, వివేక్‌కు దర్రీస్‌ బహూకరణ

Sep 28 2026 1:05 AM | Updated on Sep 28 2026 1:05 AM

కాశిబుగ్గ: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకల్లో వరంగల్‌ కొత్తవాడలో తయారు చేసిన దర్రీస్‌లను రాష్ట్ర మంత్రులకు బహూకరించారు. జయంతి వేడుకలకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని చేనేత సహకార సంఘాలు అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, చేనేత కార్మికులు, పద్మశాలి సంఘాల నుంచి వంద మందికి పైగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, కార్మిక శాఖమంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామికి చేనేత దర్రీస్‌లను అందజేశారు. చేనేత సంఘం ప్రతినిధులు చిప్ప వెంకటేశ్వర్లు, ఝెలుగం సాంబయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా నుంచి అడిగొప్పుల సంపత్‌, దువ్వల రాజేందర్‌, ఎలగం రావిరాజ్‌, ఝెలుగం వెంకటమల్లు, చిన్న వీరస్వామి, వలుస లక్ష్మీనారాయణ, కూరపాటి సంపత్‌, బూర వేణుమాధవ్‌, ఓం ప్రకాశ్‌, మాటేటి రాములు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement