లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలు సమాజ నిర్మాణానికి స్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలు సమాజ నిర్మాణానికి స్ఫూర్తి

Sep 28 2026 1:05 AM | Updated on Sep 28 2026 1:05 AM

జనగామ రూరల్‌: సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, ప్రజాసేవకు జీవి తాన్ని అంకితం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని, ఆయన ఆశయాలు సమసమాజ నిర్మాణానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా కొనియాడారు. ఆది వారం కలెక్టరేట్‌లోని జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ 111వ జయంతి సందర్భంగా కలెక్టర్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం బాపూజీ చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, ఆర్టీఏ సభ్యులు చిలువేరు అభిగౌడ్‌, కుల సంఘాల ప్ర తినిధులు, సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగాల రాతపరీక్ష

జనగామ రూరల్‌: జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖలో వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీకి కలెక్టరేట్‌ ఆదివారం కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా పర్యవేక్షణలో రాత పరీక్షను ప్రశాంతంగా నిర్వహించారు. 11 పోస్టులకు గాను 281 దరఖాస్తులు రాగా 233 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఫిజీషియన్‌ 1 పోస్టుకు గాను, మొత్తం 12 దరఖాస్తులు రాగా, 7 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంఎల్‌హెపీ 6 పోస్టులకు గాను,166 దరఖాస్తులు రాగా,130 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ 2 పోస్టులకు 96 దరఖాస్తులు రాగా, 90మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. సైకియాట్రిస్ట్‌ 1 పోస్టుకు ఒక అభ్యర్థి దరఖాస్తు చేసుకోగా గైర్హాజరయ్యారు. ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌ 1 పోస్టుకు గాను 6 దరఖాస్తులు రాగా, 6 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, ఉపాధి శాఖ అధికారి కుమారస్వామి పాల్గొన్నారు.

బతుకమ్మతల్లి విగ్రహ

నిర్మాణానికి భూమి పూజ

జఫర్‌గఢ్‌: మండలంలోని సాగరం గ్రామంలో నూతనంగా చేపడుతున్న బతుకమ్మ తల్లి విగ్రహ నిర్మాణానికి భూమి ఆదివారం భూమి పూజ చేశారు. గ్రామానికి చెందిన పిన్నింటి అనిత చంద్రశేఖర్‌ దంపతులు బతుకమ్మ తల్లి విగ్రహ నిర్మాణానికి రూ.2.50 లక్షల విరాళంగా అందజేయగా సర్పంచ్‌ తాటికాయల మమత చేతన్‌ చేతుల మీదుగా భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కాగా విగ్రహ దాత చంద్రశేఖర్‌ దంపతులను గ్రామస్తులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ సుమన్‌, వరికెల మహేశ్వర్‌రావు, కత్తుల కుమారస్వామి, గ్రామస్తులు పాల్గొన్నారు.

డబుల్‌ బెడ్రూం వాసులకు న్యాయం చేయాలి

జనగామ రూరల్‌: మూడో విడత డబుల్‌ బెడ్రూం ఇళ్లలో నివాసం ఉంటున్న పేదలకు న్యాయం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో మూడో విడత ఇళ్ల స్థలాలు కోల్పోయిన వారికి గత ప్రభుత్వం 72 మందికి డబుల్‌ బెడ్రూం ఇళ్లను డ్రా ద్వారా కేటాయించారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చినవి చెల్లవని కాంగ్రెస్‌ ప్రభుత్వం నివాసం ఉంటున్న పేదల ఇల్లు కూడా డ్రా తీసి ఇతరులకు కేటాయించారని, దీంతో పేదల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉందన్నారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బాల్నే వెంకట మల్లయ్య, కళ్యాణం లింగం, పాము శ్రీకాంత్‌ పగిడిపల్లి బాలమణి, ఎర్ర రజిత, మునిసిపట్ల జయ, మాదాసి సుధాకర్‌, గంపల సురేష్‌, కొమ్మ గళ్ళ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement