గ్యాస్‌ సబ్సిడీకి ఈకేవైసీ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సబ్సిడీకి ఈకేవైసీ తప్పనిసరి

Sep 28 2026 1:05 AM | Updated on Sep 28 2026 1:05 AM

● వచ్చేనెల నుంచి కఠినంగా అమలు

● కొత్త గ్యాస్‌ కనెక్షన్లకు ఎదురుచూపులు

● జిల్లా వ్యాప్తంగా 1,60,016 కనెక్షన్లు

జనగామ రూరల్‌: ఎల్పీజీ గ్యాస్‌ వినియోగదారులు ఈకేవైసీకి చేసుకోవడానికి గతంలో మూడు నెలల పాటు అవకాశం కల్పించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే నెల నుంచి ఈకేవైసీ అమలు చేసేందుకు అధికారులు కఠినంగా ప్రణాళిక సిద్ధం చేశారు. సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం ఈకేవైసీని అమలు చేయాలని తీర్మానించింది. ఇందులో భాగంగా మూడు నెలలుగా లబ్ధిదారులకు సూచనలు చేస్తుండగా, కొంతమంది లబ్ధిదారుల్లో స్పందన కరువైంది. తెల్ల రేషన్‌కార్డు కలిగిన నిరుపేదలకు మహాలక్ష్మి పథకం రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే కేంద్ర ప్రభుత్వం సైతం ఉజ్వల పథకం కింద గ్యాస్‌ కనెక్షన్‌ పొందిన లబ్ధిదారులకు సబ్సిడీ అందిస్తోంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో తమ పూర్తి వివరాలు అందజేయాలని కొన్ని నెలలుగా ప్రభుత్వాలు ప్రకటనలు చేశాయి. గ్యాస్‌ వినియోగదారులు ఈ కేవైసీ చేసుకునేలా ఏజెన్సీలు ప్రోత్సహించాలని అధికారులు సూచిస్తున్నారు.

జిల్లాలో పరిస్థితి.

జిల్లాలో హెచ్‌పీ, భారత్‌, ఇండేన్‌ ఆయిల్‌ కంపెనీలకు చెందిన గ్యాస్‌ కనెక్షన్లు మొత్తం 1,60,016 ఉండగా డిస్ట్రిబ్యూటింగ్‌ ఏజెన్సీలు 12 వరకు ఉన్నారు. 86,154 మంది జనరల్‌ కేటగిరీ కనెక్షన్లు పొందగా అందులో దీపం పథకం కింద కనెక్షన్ల్లు 41,222, ఉజ్వల కనెక్షన్లు 18,070, సీఎస్‌ఆర్‌ కింద 14,570 కనెక్షన్ల్లు అందజేశారు. అంతేగాకుండా హెచ్‌పీ గ్యాస్‌ దాదాపు 30వేలు, భారత్‌ 60 వేలు, ఇండేన్‌ 70వేలు కనెక్షన్లు ఉన్నాయి. పట్టణ పరిధిలో వినియోగదారులు 21 రోజులు, గ్రామీణ ప్రాంతంలో 45 రోజుల అంతరంతో సిలిండర్లను బుకింగ్‌ చేసుకునేలా నిబంధనలు మార్చడంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడంలేదు.

ఎదురుచూస్తున్న ప్రజలు

గతేడాది జిల్లాలో దాదాపు 15వేల మంది కొత్త రేషన్‌కార్డులు పొందారు. వారిలో అధిక మంది నూతన గ్యాస్‌ కనెక్షన్ల కోసం నిరీక్షిస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద వేల కుటుంబాలు రూ.500కు రాయితీ సిలిండర్‌ తీసుకుంటున్నారు. ఈ పథకానికి రేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. కొత్త గ్యాస్‌ కనెక్షన్ల్లు మంజూరు నిలిచిపోవడంతో నూతన కార్డుదారులకు మహాలక్ష్మి పథకం ప్రయోజనం దక్కకుండా పోతోంది. దీపం పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నా లబ్ధిదారులు చనిపోతే వారి పేరిట ఉన్న కనెక్షన్లు వారి వారసుల పేరిట బదిలీ కావడం లేదు.

నిబంధనలు కఠినతరం

గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న లబ్ధిదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. తుది గడువు ఏమిలేదని, లబ్ధిదారులు సంబంధిత ఏజెన్సీని సంప్రదించి చేయించుకోవాలి. రానున్న రోజుల్లో నిబంధనలు మరింత కఠినంగా ఉండనున్నాయి. సబ్సిడీకి ఈకేవైసీ తప్పనిసరి. అలాగే నూతనంగా రేషన్‌ కార్డు పొందిన లబ్ధిదారులు కొత్త కనెక్షన్ల జారీకి ఇంకా ఎలాంటి నిబంధనలు రాలేదు.

–సురేష్‌ రెడ్డి, డీసీఎస్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement