దేవాదులతో వేలాది ఎకరాలకు నీళ్లు | - | Sakshi
Sakshi News home page

దేవాదులతో వేలాది ఎకరాలకు నీళ్లు

Sep 28 2026 1:05 AM | Updated on Sep 28 2026 1:05 AM

● ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రఘునాథపల్లి: భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా 24 యేళ్ల క్రితం తాను నాటిన దేవాదుల అనే మొక్క ఇప్పుడు మహా వృక్షమై వేలాది ఎకరాలకు సాగు, అనేక గ్రామాలకు తాగునీరు అందిస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం మండలంలోని లక్ష్మితండా, ఇబ్రహీంపూర్‌, ఫతేషాపూర్‌లో రూ 2.45 కోట్ల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, రూ.51లక్షలతో సీసీ రోడ్లు, నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే అధికారులు, ప్రజాప్రతినిదులు, కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ప్రారంభించారు, అనంతరం ఇబ్రహీంపూర్‌లో సర్పంచ్‌ పోకల శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చీటకోడూర్‌, ఆలేరు కెనాల్‌లకు షట్టర్లు ఏర్పాటు చేసి యేటా ఫతేషాపూర్‌, ఇబ్రహీంపూర్‌ చెరువులు నింపేలా చర్యలు తీసుకుంటా అన్నారు. గత ఎమ్మెల్యే పనులు, పథకాలు, పార్టీ పదవులకూ కమీషన్లు తీసుకుంటూ చిల్లర, చిచోర పనులు తప్ప, నియోజకవర్గం అభివృద్ధికి చేసిందేమి లేదని ఆరోపించారు. నియోజకవర్గంలో రూ.1,600 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అధికారం కోల్పోయామనే అక్కసుతో బీఆర్‌ఎస్‌, అధికారం ఆశతో బీజేపీ నిత్యం ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు. ఆయా కార్యక్రమాల్లో ట్రాన్స్‌కో ఎస్‌ఈ చెరుకు సంపత్‌రెడ్డి, డీఈలు లక్ష్మినారాయణరెడ్డి, విజయ్‌కుమార్‌, ఈఈ అనూప్‌కుమార్‌, ఏడీఈలు స్వామిరెడ్డి, ముంతాజ్‌ హుస్సేన్‌, సుధాకర్‌, ఎంపీడీఓ కావ్య శ్రీనివాసన్‌, పీఆర్‌ డీఈ కిరణ్‌కుమార్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ మారుజోడు రాంబాబు, కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గాదె మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు సుజాతసత్యనారాయణ, పయ్యావుల రవి, బొమ్మ వీరస్వామి, ఉప సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement