ఓటు హక్కు పరిరక్షణకు నేడు కాంగ్రెస్‌ నిరసన | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కు పరిరక్షణకు నేడు కాంగ్రెస్‌ నిరసన

Sep 28 2026 1:05 AM | Updated on Sep 28 2026 1:05 AM

● నెహ్రూ పార్క్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ, ధర్నా

● డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి

జనగామ: ఓట్ల చోరీ వ్యవహారం, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 28న (సోమవారం) జిల్లా కేంద్రంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి తెలిపారు. ఆదివారం డీసీసీ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.. ఉదయం 10 గంటలకు నెహ్రూ పార్క్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్‌ చేశారు. వైటీడీఏ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మీనారాయణ నాయక్‌ మాట్లాడుతూ.. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి ఆధ్వర్యంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ కడియం కావ్య, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహ రి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి నాయకత్వంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మారుజోడు రాంబా బు, లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, లోకుంట్ల ప్రవీణ్‌, బోనాసి క్రాంతి, జాయ మల్లేష్‌, మహేందర్‌రెడ్డి, చింతకింది మల్లేష్‌, శ్రవణ్‌బాబు, శ్రీనివాస్‌, మహేష్‌, కోట నాయక్‌, జనార్దన్‌, ప్రవీణ్‌, దామోదర్‌రెడ్డి, బాల్దె శ్రీశైలం, నర్సింహులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement