జిల్లా వ్యవసాయ కార్యాలయ ఆస్తులు జప్తు | - | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యవసాయ కార్యాలయ ఆస్తులు జప్తు

Sep 27 2026 1:04 AM | Updated on Sep 27 2026 1:04 AM

● కోర్టు ఆదేశాల మేరకు సామగ్రి బయట

● అధికారి లేకపోవడంతో తిరుగుముఖం

జనగామ రూరల్‌: జిల్లా వ్యవసాయ కార్యాలయ ఆస్తులు శనివారం జప్తు చేశారు. 2015, 2016 సంవత్సరాల్లో జిల్లా వ్యవసాయ శాఖ లబ్ధిదారులకు వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈమేరకు దీప్తి ఇంజనీరింగ్‌ వెల్డింగ్‌ వర్క్స్‌ ఓనర్‌ కత్తుల రాజిరెడ్డి రూ. 18 లక్షల 45 వేల విలువైన పరికరాలు అందించాడు. వాటికి అప్పటి ప్రభుత్వం ఇచ్చిన డీడీలు బౌన్స్‌ కావడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. దీంతో జిల్లా వ్యవసాయ కార్యాలయంలో ఉన్న ఆస్తులు, ఫర్నిచర్‌ జప్తు చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీంతో కలెక్టరేట్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలోని ఫర్నిచర్‌ బయట పెట్టారు. జిల్లా అధికారి లీవులో ఉన్నారని వ్యవసాయ శాఖ సిబ్బంది చెప్పడంతో కోర్ట్‌ సిబ్బంది ఆ సామగ్రిని అక్కడే పెట్టి వెళ్లిపోయారు. తిరిగి 28న (సోమవారం) వచ్చి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement