మున్సిపాలిటీకి నిధులు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీకి నిధులు విడుదల చేయాలి

Sep 27 2026 1:04 AM | Updated on Sep 27 2026 1:04 AM

● మంత్రికి ఎమ్మెల్యే పల్లా వినతి

జనగామ: మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన నిధులను వెంటనే విడుదల చేసి పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఇందిరానగర్‌తో పాటు మూడు వార్డులకు మంజూరైన రూ.25 కోట్లు, ఎన్నికల సమయంలో మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరైన రూ.18.9 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, షామీర్‌పేట వద్ద కిలోమీటర్‌ అప్రోచ్‌ రోడ్డుకు ఆర్‌అండ్‌బీ ద్వారా నిధులు మంజూరు చేయాలన్నారు. గండిరామారంలో వరద నీటిలో మునిగిన రెం డు పంపులను మరమ్మతు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి అవసరమైన మేరకు అదనపు నిధులు కేటాయించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement