రెండు డీఏల ప్రకటనపై హర్షం | - | Sakshi
Sakshi News home page

రెండు డీఏల ప్రకటనపై హర్షం

Sep 26 2026 1:14 AM | Updated on Sep 26 2026 1:14 AM

● ప్రభుత్వానికి, కలెక్టర్‌కు టీఎన్‌జీఓ నాయకుల కృతజ్ఞతలు

జనగామ: ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు, జిల్లా టీజీఈజేఏసీ చైర్మన్‌ ఖాజా షరీఫ్‌ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల్లో రెండు డీఏలను దసరా సందర్భంగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంపై ఉద్యోగుల్లో సంతోషం వెల్లివిరుస్తోందన్నారు. రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో 206 ఉద్యోగ సంఘా లతో కలిసి మారం జగదీశ్వర్‌, ఏలూరి శ్రీనివాస్‌ తదితరులు ఉద్యోగుల సమస్యలను పలు దశల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. జిల్లా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సహకరిస్తున్న కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాకు కృతజ్ఞతలు తెలి పా రు. జిల్లా కార్యదర్శి పెండెల శ్రీనివాస్‌, రాష్ట్ర నాయకుడు పేర్వారం ప్రభాకర్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు సానం రాజనర్సయ్య, జిల్లా కోశాధికారి ఎండీ హఫీ జ్‌, నాగార్జున, యశోద తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement