మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

మంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

Sep 26 2026 1:14 AM | Updated on Sep 26 2026 1:14 AM

జనగామ: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రెవె న్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌లతో కలిసి కలెక్టర్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయం, బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ప్రెస్టన్‌ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించే కార్యక్రమాలకు వేదిక, పందిళ్లు తదితర ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాలమణిశ్రీనివాస్‌తో కలిసి మున్సి పల్‌ కార్యాలయం, ప్రెస్టన్‌ కళాశాల గ్రౌండ్‌ను పరిశీలించారు. ఆర్డీఓ గోపీరాం, ఏసీపీ భీమ్‌శర్మ, మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement