పాలకుర్తిటౌన్ (దేవరుప్పుల) : కాలం కలిసి రాక రైతులు గోస పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. బుధవారం దేవరుప్పుల మండలంలోలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన బంజర గ్రామంలో రోడ్డు పక్కన పున్న చెరువులో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ.. పంటలకు నీరందడంలేదని.. పంటలు ఎండిపోవడంతో ఉపాధి పనులకు వస్తున్నామని చెప్పారు. స్పందించిన ఎర్రబెల్లి మాట్లాడుతూ.. చెరువులకు సాగు నీరు అందించాలని, వందల ఎకరాలు సాగు చేయకుండా రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. రైతులకు ఏమి చేఆయలో తెలియని వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా కొనసాగడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో దేవరుప్పుల మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తీగల దయాకర్, ఏల సుందర్, కరుణాకర్, నవీన్‌నాయక్, పానుగంటి కృష్ణ పాల్గొన్నారు.
● మాజీ మంత్రి
ఎర్రబెల్లి దయాకర్‌రావు


