కట్టెల పొయ్యి వంటపై కలెక్టర్‌ సీరియస్‌ | - | Sakshi
Sakshi News home page

కట్టెల పొయ్యి వంటపై కలెక్టర్‌ సీరియస్‌

Sep 23 2026 1:13 AM | Updated on Sep 23 2026 1:13 AM

లింగాలఘణపురం: కట్టెల పొయ్యిపై వంట చేయడంపై కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆగ్ర హం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను, ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించారు. అనంతరం వంటశాలను పరిశీలించేందుకు వెళ్లగా కట్టెల పొయ్యిపై వంట చేయడం గమనించి అసహనం వ్యక్తం చేస్తూ గ్యాస్‌పై మాత్రమే వంట చేయాలని ఆదేశించారు. వంట చేసే మహిళా సంఘ సభ్యులను మార్చాలని ప్రిన్సిపాల్‌ సునితను ఆదేశించారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌ సునిత సంబంధిత సర్పంచ్‌ ఎడ్ల లావణ్యరాజు, గ్రామంలోని వీఓఏల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసి వంట చేసే సభ్యులను కలెక్టర్‌ ఆదేశాలతో మార్చుతున్నామని, ఇతర మహిళలను నియమించాలని కోరారు.

ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి

జనగామ రూరల్‌: జూనియర్‌ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను, కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..విద్యార్థులు, అధ్యాపకుల హాజరును ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వా రా ప్రవేశ, నిష్క్రమణ సమయాల్లో తప్పనిసరిగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షలో డీఐఈఓ జితేందర్‌ రెడ్డి, ఇంటర్మీడియట్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

ఎంజీఎం దుస్థితిపై

ప్రశ్నిస్తే దాడి చేస్తారా?

జనగామ: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి దుస్థితిని ప్రశ్నిస్తూ సందర్శనకు వెళ్లిన మాజీ చీఫ్‌ విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌పై పోలీసులు వ్యవహరించిన తీరును ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంగళవా రం తీవ్రంగా ఖండించారు. ఆస్పత్రిలో బెడ్లు, అంబులెన్స్‌ల కొరతతో పాటు పైకప్పులు పెచ్చులూడుతున్న దుస్థితిపై ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యేను అడ్డుకుని దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను ప్రశ్నించినందుకు కడుపులో తన్నడం, గాయపర్చడం ఏ విధమైన ప్రజాస్వామ్య పాలన అని ప్రశ్నించారు. ఆస్పత్రుల పరిస్థితులను చక్కదిద్దాల్సిన ప్రభుత్వం, సమస్యలను ప్రశ్నించే వారిపై పోలీసులతో దాడులు చేయించడం సిగ్గుచేటన్నారు. పోలీసుల అత్యుత్సాహాన్ని వెంటనే అరికట్టాలని, వినయ్‌ భాస్కర్‌పై జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

బాగున్న రోడ్డును ధ్వంసం చేసి కొత్త నిర్మాణమా?

జనగామ: మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో బాగానే ఉన్న సీసీ రోడ్డును పూర్తిగా ధ్వంసం చేసి నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న అంశంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ వాట్సాప్‌ వేదికగా మున్సిపల్‌ కమిషనర్‌కు మంగళవారం విజ్ఞప్తి చేశారు. భారీ వాహనాల రాకపోకలు పెద్దగా లేని చిన్న కాలనీ రోడ్డును పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఏమిటన్న అంశాన్ని అధికారులు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు అక్కడక్కడ మాత్రమే దెబ్బతిన్నట్లయితే, తక్కువ ఖర్చుతో మరమ్మతులు చేపట్టవచ్చన్నారు. ఈ అంశంపై మున్సిపల్‌ కమిషనర్‌ స్వయంగా పర్యవేక్షించి పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరా రు. ఈ విషయమై కమిషనర్‌ మాట్లాడుతూ.. సీసీ రోడ్డు ధ్వంసానికి సంబంధించి ఇంజనీరింగ్‌ డిపార్టుమెంట్‌ డీఈ, ఏఈలతో పాటు కౌన్సిలర్లను పిలిచి మాట్లాడతామని, విచారణ జరుపుతామన్నారు. సీసీరోడ్డు నిర్మాణ సమయంలో ఏ స్థితిలో ఉందో అనే విషయమై డీఈ పరిశీలించారా లేదా అని కూడా ఆరా తీస్తామన్నారు.

రైతు రిజిస్ట్రేషన్‌ ద్వారా రైతు ఐడీ పొందాలి

జనగామ రూరల్‌: రైతు నమోదు చేసుకొని, రైతు ఐడీని పొందాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రైతు నమోదు చేసుకున్న రైతులు సంబంధిత వెబ్‌సైట్‌ లింక్‌ను ఓపెన్‌ చేసి, తమ ఆధార్‌ నంబర్‌ నమోదు చేయాలని తెలిపారు. ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసిన ఫార్మర్‌ ఐడీ నంబర్‌ను తెలుసుకోవచ్చన్నారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement