లింగాలఘణపురం: మండలంలోని ప్రసిద్ధిగాంచిన జీడికల్ వీరాచల రామచంద్రస్వామి జాతర బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నవంబర్‌లో జరగనున్న బ్రహ్మోత్సవాలపై మంగళవారం ఆల య ప్రాంగణంలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతర ఏర్పాట్లపై అన్నీ శాఖల సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్‌ను కోరారు. అదేవిధంగా పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్యంతోపాటు భక్తుల భద్రతపై పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలేరు నుంచి జీడికల్ రోడ్డులో అసంపూర్తిగా ఉన్న 3 కిలో మీటర్ల రోడ్డు పనులు కూడా త్వరలో పూర్తవుతాయని వివరించారు. చారిత్రక జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయ విశిష్టతను మరింత పెంచేలా బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని, అందుకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. సమావేశంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, డీపీఓ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ గోపీరామ్, డీఎంహెచ్‌ఓ వాణిశ్రీ, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సంపత్‌రెడ్డి, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీకాంత్, పీఆర్ ఈఈ రవీందర్, మార్కెట్ వైస్ చైర్మన్ శివకుమార్, దేవస్థాన చైర్మన్ మూర్తి, తహసీల్దార్ అండాలు, ఎంపీడీఓ శివశంకర్‌రెడ్డి, ఈఓ వంశీ, సర్పంచ్ కె.మమత సంపత్, పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌మనోహర్, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయాలి
జనగామ రూరల్: వీబీజీ రామ్‌జీ పథకం కింద ఇప్పటికే మంజూరై, చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహ రి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, మిషన్ భగీరథ, వ్యవసాయ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పనుల పురోగతిపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈసారి వర్షపాతం తక్కువగా ఉన్నందున రాబోయే రోజుల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కింద పెండింగ్‌లో ఉన్న భూసేకరణను త్వరి తగతిన పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ మాట్లాడు తూ.. పాఠశాలల ప్రహారీలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులకు ప్రాధాన్యం ఇచ్చి, వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ కిరణ్ ప్రకాష్, డీఆర్డీఓ భాస్కర్, డీఏఓ అంబికా సోనీ, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ సీతారాం, విద్యుత్ శాఖ ఎస్‌ఈ సంపత్ రెడ్డి, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ శ్రీకాంత్ పాల్గొన్నారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దు
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జీడికల్ వీరాచల రామచంద్రస్వామి జాతరపై సమీక్ష


