● డీసీపీ రాజమహేంద్ర నాయక్
జనగామ రూరల్: ఆయుర్వేద యోగా ఆరోగ్యకరమైన జీవనశైలి దైనందిన జీవితంలో తప్పనిసరిగా భాగం కావాలని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. మంగళవారం 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ వద్ద ఆయుర్వేద వెల్‌నెస్ – యోగా వాక్‌ను డీసీపీ రాజ మహేంద్ర నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. డీసీపీ మాట్లాడుతూ..ఆయుర్వేదం సూచించే నివారణాత్మక ఆరోగ్య విధానాలను జీవితంలో అమలు చేయాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ వాణిశ్రీ మాట్లాడుతూ.. యోగా, ఆయుర్వేదం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ మమత, డా.సరిత, డీపీఎం కుమార్, వైద్యాధికారులు, ఏఎన్‌న్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు, ఆయుష్ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు మెగా ఆయుష్ వైద్యశిబిరం
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఈనెల 23న మున్సిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్‌న్స్ హాల్‌లో మెగా ఆయుష్ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆయుష్ అధికారి మమత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో ఆయుర్వేద, హోమియో, యునాని, యోగా వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని జిల్లా ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


