పాలకుర్తి టౌన్: మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో సోమవారం గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భగంగా స్వామివారికి గణపతి అకారంలో అన్నపూజ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు, అర్చనలు, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి
● రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
సి. సుదర్శన్ రెడ్డి
జనగామ రూరల్: ఎస్‌ఐఆర్–2026 ప్రక్రియలో భాగంగా రానున్న 30 నుంచి 40 రోజులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఎస్‌ఐఆర్–2026 కార్యక్రమంపై కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఫారం–6, ఫారం–7, ఫారం–8 దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని సూచించారు. నోటీసులు జారీ చేయడంతో పాటు వాటిపై తదుపరి చర్యలు చేపట్టి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. వీసీలో జనగామ ఆర్డీఓ గోపిరాం, ఎన్నికల వి భాగం సూపరింటెండెంట్ శ్రీధర్ పాల్గొన్నారు.
నేడు ఆయుర్వేద వెల్‌నెస్ యోగా వాక్
జనగామ రూరల్: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 22వ తేదీన (మంగళవారం) ఉదయం 7 గంటలకు ఆయుర్వేదంపై అవగాహన కార్యక్రమం ఉంటుందని ఆయుష్ అధికారి మమత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యోగా, ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రకృతి ఆధారిత ఆరోగ్య విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయుర్వేద వెల్‌నెస్ యోగా వాక్‌ను జిల్లాకేంద్రంలోని నెహ్రూ పార్క్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు నిర్వహించనున్నట్లు, ప్రతీ ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
చోరీ కేసులో నిందితుడికి జైలుశిక్ష
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ నల్ల గొండలోని జేఎఫ్‌సీఎం స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి డి.సాయిమేఘన సోమవారం తీర్పు వెలువరించారు. నల్లగొండ మండలం కమ్మగూడెం గ్రామానికి చెందిన పోలగోని సైదులు 2025 ఏప్రిల్ 30న ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి ఊరికి వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు సైదులు ఇంటి ప్రధాన ద్వారంతో పాటు బీరువా తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నల్లగొండ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఎర్రమల్లయ్యకుంటకు చెందిన సిరిగిరి సాయిబాబా అలియాస్ సాయికుమార్ అలి యాస్ సాయి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తేలింది. నిందితుడిని కోర్టులో హాజరుపర్చిన పోలీసులు సరైన సాక్ష్యాధారాలను సమర్పించడంతో అతడికి 10 నెలల 15 రోజుల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధి స్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. జరి మానా చెల్లించని పక్షంలో మరో 7 రోజులు జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేశారు.
నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
స్టేషన్‌ఘన్‌పూర్: గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక పుట్టలమ్మ చెరువు వద్ద నిర్వహించనున్న గణనాథుల విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను ఎన్పీడీసీఎల్ ప్రత్యేక అధికారి, ఎస్‌ఈ(విజిలెన్స్) పి.శ్రీకాంత్ సోమవారం పరిశీలించారు. విఘ్నేశ్వర నిమజ్జనం కోసం చేస్తున్న పనులను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు అందించారు. ఉత్సవ కమిటీల నిర్వాహకులు విద్యుత్ భద్రతా జాగ్రత్తలను పాటిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ప్రశాంతంగా నిమజ్జనాలు చేసుకోవాలన్నారు. ఆయన వెంట డీఈ బి.సారయ్య, ఏడీఈ రణధీర్‌రెడ్డి, ఏఈలు పి.శంకర్, శివకుమార్, లైన్ ఇన్‌స్పెక్టర్ పెద్దిరెడ్డి, లైన్‌మన్‌లు వాసం శ్రీధర్, అన్వర్‌పాషా, కాంట్రాక్టర్ చల్లా రఘురెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


