రాజయ్య విమర్శలు విడ్డూరం | - | Sakshi
Sakshi News home page

రాజయ్య విమర్శలు విడ్డూరం

Sep 22 2026 12:54 AM | Updated on Sep 22 2026 12:54 AM

● స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్‌ఘన్‌పూర్‌: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఉన్న డాక్టర్‌ రాజయ్య బర్తరఫ్‌ అయ్యారని, అలాంటి వ్యక్తి తనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఘన్‌పూర్‌ కార్యాలయంలో సోమవారం పార్టీ పట్టణ కమిటీ, అనుబంధ సంఘాల కమిటీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు అంబటి కిషన్‌రాజ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఒక వికెట్‌ పడిందని, మరో వికెట్‌ పడుతుందని డాక్టర్‌ రాజయ్య వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజయ్య హిట్‌ వికెట్‌ అయ్యాడని, అతడిని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారని, కేవలం ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై, సీఎంపై, తనపై విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. నియోజకవర్గంలో రూ.1,600కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, హ్యామ్‌లో ఆర్‌అండ్‌బీలో 8, పీఆర్‌లో 23 మొత్తం 31 రోడ్లకు గాను రూ.401 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. కేసీఆర్‌ కుమార్తె కల్వ కుంట్ల కవిత చేస్తున్న ఆరోపణలకు కేటీఆర్‌, హరీశ్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ తాటికొండ వినయ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ నీల రాజమ్మగట్టయ్య, నాయకులు కనకం రమేశ్‌, పొన్న రవి, బూర్ల శంకర్‌, పోశాల కృష్ణ, మేకల మల్లేశం, గట్టు రమేశ్‌, గన్ను నర్సింహులు, గుర్రం రాజు, హరినాధ్‌, తోకల రాజు, సారయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement