● కలెక్టర్ ఆదేశాలతో
మున్సిపల్ కమిషనర్ చర్యలు
జనగామ: పట్టణంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రాంతం నుంచి సిద్దిపేట రోడ్డు మున్సిపల్ లిమిట్ వరకు రోడ్డుకు ఇరువైపులా అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న వ్యాపార సముదాయాలు, ఫు ట్‌పాత్ వ్యాపారాలు, డబ్బాలు, తాత్కాలిక షెడ్ల తొ లగింపు ప్రక్రియకు ఆదివారం శ్రీకారం చుట్టారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా ఏ ర్పాటు చేసిన టీ, సోడా, కూరగాయలు, సెలూన్లు, హోటళ్లు, ప్లాస్టిక్ సామగ్రి విక్రయ కేంద్రాలు తది తర వ్యాపారాలకు సంబంధిం చిన నిర్మాణాలను తొలగించారు. రోడ్లను విశాలంగా ఉంచడంతో పాటు ట్రాఫిక్‌కు, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా, ప్రమాదాల నివారణకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ పరిధిలోని రోడ్లు, డ్రెయినేజీలను ఆక్రమించి ఎవరూ వ్యాపారాలు నిర్వహించరాదని కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక షెడ్ల యజమానులకు ముందస్తుగా సమాచారం అందించి, వాటిని స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించినట్లు తెలిపారు. స్వచ్ఛ జనగామ, ప్రమాదాల నివారణ, విశాలమైన రహదారుల కోసం ప్రజలు మున్సిపల్ అధికారులకు సహకరించాలని కమిషనర్ కోరారు. ఆక్రమణల తొలగింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.


