రాష్ట్రస్థాయి రోబోటిక్‌ గోల్డ్‌ ఛాలెంజ్‌కు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి రోబోటిక్‌ గోల్డ్‌ ఛాలెంజ్‌కు సన్నద్ధం

Sep 19 2026 5:50 AM | Updated on Sep 19 2026 5:50 AM

వెల్ది మోడల్‌ స్కూల్‌లో ప్రత్యేక వర్క్‌షాపు

రఘునాథపల్లి: రాబోయే రాష్ట్రస్థాయి రోబోటిక్‌ గో ల్డ్‌ ఛాలెంజ్‌ పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేసే ఉద్దేశంతో మండలంలోని వెల్ది మోడల్‌ స్కూల్‌లో శుక్రవారం ప్రత్యేక రోబోటిక్‌ వర్క్‌షాపు నిర్వహించారు. ఒన్నోవేషన్‌ కోచ్‌ సుహాస్‌ పర్యవేక్షణలో వి ద్యార్థులకు రోబోటిక్స్‌కు సంబంధించిన పలు అంశాలపై శిక్షణ అందించారు. వర్క్‌షాపులో భాగంగా విద్యార్థులు రూపొందించిన వివిధ రోబోటిక్‌ ప్రాజెక్టులను ప్రదర్శించి వాటి పనితీరును వివరించారు. ఇన్‌చార్జ్‌ ప్రిన్స్‌పాల్‌ గడ్డం జయశ్రీ, ఆంగ్ల ఉపాధ్యాయుడు కందగట్ల గణేష్‌తో పాటు ఇతర ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించి వాటి అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. విద్యార్థుల సృజనాత్మకత, ప్రతిభను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచేలా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. రోబోటిక్స్‌పై అసక్తిని పెంపొందిస్తూ విద్యార్థులకు శిక్షణ అందిస్తున్న ఇన్నోవేషన్‌ కోచ్‌ సుహాస్‌ను ఈ సందర్భంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement