జనగామ: జిల్లాలోని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులకు సంబంధించిన భూములు, ఆస్తుల రికార్డులను కూడా చట్టపరమైన నిబంధనల ప్రకారం పరిశీలించాలని టీపీసీసీ స్పోక్స్‌పర్సన్ నూక కిరణ్ కుమార్ యాద వ్, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ గురువారం కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. సంబంధిత భూముల రికార్డులు, రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లను పరిశీలించి సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఈసందర్భంగా వా రు మాట్లాడుతూ.. తాము ఎవరి మీద ముందస్తుగా ఆరోపణలు చేయడం లేదని, రికార్డులను పూర్తి గా పరిశీలించి వాస్తవాలను తేల్చాలని అన్నారు. ఆయా భూముల రికార్డులను పూర్తిగా పరిశీలించి వాస్తవాలను తెలియజేయాలని కోరారు.
వాస్తవాలు వెలుగులోకి తేవాలి
ఉద్యమ సమయంలో సెంటు భూమి కూడా లేని వారికి పదేళ్లలో వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా స్పోక్స్‌పర్సన్ నూక కిరణ్ యాదవ్, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.. మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన భూ ములు, ఫాంహౌస్‌ల విస్తీర్ణం, భూముల కొనుగో ్లు, బదలాయింపులు తదితర అంశాలపై అధికారిక రికార్డుల ఆధారంగా వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. 22–ఏ నిషేధిత జాబితాలో ఉన్నట్లు పేర్కొంటున్న భూముల ప్రస్తుత పరిస్థితిపై స్పష్టత అవసరమన్నారు. కార్యక్రమంలో వైటీడీఏ మెంబర్ లక్ష్మీనారాయణ నాయక్, మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జగదీష్ చంద్రారెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, పట్టణ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు, ఆర్టీఏ సభ్యుడు అభిగౌడ్, లోకుంట్ల ప్రవీణ్, బడికె ఇంది ర, మాజిద్ అప్సర్, నారాయణరెడ్డి, ప్రదీప్ యాదవ్, కళ్యాణి, రాజమౌళి, కౌన్సిలర్ సుమలత, వేమల్ల పద్మ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు వినతి పత్రం అందించిన కాంగ్రెస్ నాయకులు


