జనగామ: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై ఆరోపణలు చేసే ముందు కాంగ్రెస్ నాయకులు గుండైపె చేయి వేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలని మార్కెట్ మాజీ చైర్మన్ సిద్దిలింగం, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ పోకల జమున, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పల్లా ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారని, ఆయనపై ఆరోపణల్లో నిజం ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ చేశారు. మంత్రి సీతక్క జనగామకు వచ్చి రూ.17 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని చెబుతున్నారని, ఏయే పనులకు ఎంత నిధులు ఖర్చు చేశారో పూర్తి నివేదికను ప్రజల ముందు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్లను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో రుణాలు, రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు వచ్చేలా సృష్టించారన్నారు. విద్య, వైద్య రంగాల్లో సేవలు అందిస్తూ ప్రజలకు అండగా నిలిచే పల్లాపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు ఉడుగుల కిష్టయ్య, సేవెళ్ల మధుసూదన్, వాంకుడోతు అనిత, పానుగంటి సువార్త, ఎనుగుందుల అనూషకృష్ణ, మంజుల, ఉల్లెంగుల నర్సింగ్, మామిడాల రాజు, దామెర రాజు, గునిగంటి రామకృష్ణ, ఉల్లెంగుల సందీప్, కొమ్మురాజు, అస్లాం తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డ
బీఆర్‌ఎస్ నాయకులు


