జనగామ: పట్టణంలోని రైల్వేస్టేషన్ ఏరియా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చొల్లేటి యశోద రెడ్డి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పాఠశాల పూర్వ వి ద్యార్థి, ఎన్నారై డాక్టర్ చొల్లేటి రాజా నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 2025–26 విద్యాసంవత్సరంలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ.50వేల నగదు పారితోషికాలను అందించారు. బుధవారం పాఠశాల ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎండీ అప్సర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ ముఖ్యఅతిథిగా పాల్గొని పదిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులకు రూ.50 వేల నగదుతో పాటు జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాజానరేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇన్‌చార్జ్ ప్రధానోపాధ్యాయుడు ఎండీ అప్సర్ మాట్లాడుతూ పాఠశాల నుంచి ఎవరైనా విద్యార్థులు ఎంబీబీఎస్ చదివితే వారికి కావాల్సిన సహాయం చేస్తానన్నారు. ఈ కా ర్యక్రమంలో ఉపాధ్యాయులు ఎన్.అనిత ఉన్నారు.


