సాగు సవాల్‌ | - | Sakshi
Sakshi News home page

సాగు సవాల్‌

Sep 10 2026 1:21 AM | Updated on Sep 10 2026 1:21 AM

పంటల రక్షణకు సూచనలు

రెండు సంవత్సరాల్లో సాగు విస్తీర్ణం ఇలా.. (ఎకరాల్లో)

జనగామ: జిల్లాలో పంటల సాగు సవాల్‌గా మారింది. పొలంలో పంట ఉన్నా, కీలక దశలో తగినంత తేమ అందకపోవడంతో పంటలపై వాతావరణ ఒత్తిడి పెరుగుతోంది. ఎల్‌నినో పరిస్థితులతో పాటు వర్షాల అసమాన పంపిణీ, పొడి విరామాలు జిల్లాలో సాగుకు సవాల్‌గా మారాయి. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలు పంటల పెరుగుదల, పూత, కాయ, గింజ అభివృద్ధి దశలకు కీలకం కావడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించి జనగామ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ వి.రమ్య వెల్లడించారు. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 2 వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 517.9 మి.మీ. కాగా 291.5 మి.మీ. మాత్రమే నమోదై 43.7 శాతం లోటు కనిపించింది. జిల్లాకు నైరుతి రుతుపవనాల సాధారణ వర్షపాతం 670.1 మి.మీ.గా ఉంది.

జిల్లాలో 3.26 లక్షల ఎకరాల్లో సాగు

వర్షాభావ పరిస్థితుల మధ్య కూడా జిల్లాలో సాగు గణనీయంగానే కొనసాగింది. సెప్టెంబర్‌ 2 నాటికి 3,26,548 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సాధారణ సాగు విస్తీర్ణం 3,59,281 ఎకరాలు కాగా 91 శాతం సాగు పూర్తయింది. గతేడాది ఇదే సమయానికి 3,24,013 ఎకరాల్లో సాగు నమోదవగా, ఈ ఏడాది స్వల్పంగా పెరిగింది.

పెరిగిన పత్తి సాగు..

పంటల సాగు నమూనాలో స్వప్ప మార్పు కనిపిస్తోంది. గతేడాది 1,80,898 ఎకరాల్లో ఉన్న వరి ఈ ఏడాది 1,54,404 ఎకరాలకు తగ్గింది. మరోవైపు ప త్తి 1,20,016 నుంచి 1,38,325 ఎకరాలకు పెరిగింది. మొక్కజొన్న 7,976 నుంచి 8,508 ఎకరాలకు,

నిఘా తప్పనిసరి..

వర్షాల మధ్య పొడి విరామాలు పెరిగితే పంటల్లో తేమ ఒత్తిడి, పోషక లోపాలు, పురుగు, తెగుళ్ల సమస్యలు ఉధృతమయ్యే అవకాశం ఉంది. రైతులు వారానికి కనీసం రెండుసార్లు పొలాన్ని పరిశీలించి ఆకుల రంగు మారడం, వాడిపోవడం, పెరుగుదల మందగించడం, పురుగుల ఉనికి, కాయలు, బోళ్లకు నష్టం వంటి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించాలి. వరిలో ఆకు ముడత, కాండం తొలుచు పురుగులను గమనించాలి. పత్తిలో తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమతో పాటు గులాబీ రంగు పు రుగు ఉనికిని పరిశీలించాలి. పసుపు, నీలం జిగురు ఉచ్చులతో పురుగులను పర్యవేక్షించవచ్చు. మొక్కజొన్న, కంది, పెసర, మినుము పంటల్లోనూ తేమ, పోషకాలు,పురుగుల నియంత్రణపై శ్రద్ధ అవసరం.

వర్షం పడిన వెంటనే..

వర్షం పడిన వెంటనే పురుగు మందులు పిచికారీ చేయకూడదు. పంట దశ, పురుగు లేదా తెగులు తీవ్రత, నేల తేమ, వాతావరణ పరిస్థితులను పరిశీలించిన తర్వాతే శాసీ్త్రయ సిఫారసు మేరకు మందులు వినియోగించాలి. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ, పంటను కాపాడేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి.

పత్తిలో తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమ నివారణకు వేపనూనె 1,500 పీపీఎం 5 మి.లీ, అసిఫేట్‌ 1.5 గ్రా. లేదా ఫ్లోనికామిడ్‌ 0.3 గ్రా.లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. గులాబీరంగు పురుగు కోసం పువ్వులు, కాయలను పరిశీలించాలి. విత్తిన 45 రోజుల నుంచి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలి. పురుగు ఉధృతి కనిపిస్తే ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలు, 4 కార్డుల త్రికోగ్రామా వదిలి, అవసరమైతే ఎమామెక్టిన్‌ బెంజోయేట్‌ 0.5 గ్రా., స్పినెటోరామ్‌ 0.9 మి.లీ. లేదా థయోడికార్బ్‌ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

మొక్కజొన్నలో నీటి ఎద్దడి ఉంటే యూరియా 2 శాతం ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వర్షాల తర్వాత ఎకరాకు 25 కిలోల యూరియా అదనంగా వేయవచ్చు. కత్తెర పురుగు నివారణకు అజాదిరాక్టిన్‌ 1,500 పీపీఎం 5 మి.లీ., ఎమా మెక్టిన్‌ బెంజోయేట్‌ 0.4 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 0.4 మి.లీ. లీటరు నీ టికి కలిపి పిచికారీ చేయాలి.

కందిలో అధిక తేమతో కాండం ముడత, తెగులు వచ్చే అవకాశం ఉన్నందున పంటను గమనించాలి. బెట్ట పరిస్థితుల్లో పే నుబంక నివారణకు 20 గ్రా. యూరియా లేదా 10 గ్రా. మల్టీ–కే లేదా పాలీఫీడ్‌ను లీ టరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పెసర, మినుములో బెట్ట పరిస్థితుల్లో పొటాషియం నైట్రేట్‌ 0.5 శాతం లేదా 19:19:19 0.5 శాతం ద్రావణాన్ని పిచికారీ చేయాలి. తెల్ల దోమకు అసిటామిప్రిడ్‌ 0.2 గ్రా. లేదా డైఫెన్‌థయురాన్‌ 1.25 గ్రా. లీటరు నీటికి పిచికారీ చేయాలి.

పంటలను కాపాడుకునేందుకు రైతుల పోరాటం

జిల్లాలో 43.7 శాతం లోటు వర్షపాతం

3.26 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు

పురుగు ఉధృతి ఆధారంగానే పిచికారీ

జనగామ రైతు విజ్ఞాన కేంద్రం

శాస్త్రవేత్త డాక్టర్‌ వి.రమ్య

పంట 2025 2026

వరి 1,80,898 1,54,404

పత్తి 1,20,016 1,38,325

మొక్కజొన్న 7,976 8,508

కంది 3,477 7,475

పెసర 1,247 3,411

వేరుశనగ 75 1,912

మొత్తం 3,24,013 3,26,548

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement