జనగామ రూరల్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు తెలంగాణ ఆత్మను, ప్రజల జీవనాన్ని తన కవిత్వంలో ప్రతిబింబించిన మహోన్నత వ్యక్తి అని, ఆయన ఆశయాలను ప్రతిఒక్కరూ అనుసరించాల ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవా రం జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ప్రజాకవి కాళోజీ నారాయణరావు 112వ జయంతిని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాళోజీ తెలుగు మాత్రమే కాకుండా ఉర్దూ, హిందీ, మరాఠీ, ఆంగ్లం తదితర భాషల్లో కవితలు రచించిన బహుభాషా కోవిదుడిగా నిలిచారన్నారు. కాళోజీ ఆశయాలు, మానవతా దృక్పథం, సామాజిక న్యాయం కోసం చూపిన మార్గాన్ని ప్రతిఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్, అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు. అలాగే కాళోజీ జయంతి సందర్భంగా జనగామ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ కడకంచి బాలమణి, కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి నారాయణరావు చి త్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా


