అక్రమ నిర్మాణాల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాల తొలగింపు

Sep 10 2026 1:21 AM | Updated on Sep 10 2026 1:21 AM

జనగామ: రహదారి, ఫుట్‌పాత్‌ ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపట్టారన్న ఫిర్యాదుల మేరకు జనగామ మున్సిపల్‌ అధికారులు బుధవారం చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌ రోడ్డులోని శ్రీ లైఫ్‌కేర్‌ హాస్పిటల్‌కు సంబంధించిన పలు నిర్మాణాలను మున్సిపల్‌ సిబ్బంది తొలగించారు. రోడ్డు వైపున ఏర్పాటు చేసిన మెట్లు, జనరేటర్‌, ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన నిర్మాణాలు రాకపోకలకు ఇబ్బందికరంగా మారుతున్నాయన్న ఫిర్యాదులు అధికారుల దృష్టికి వెళ్లగా, మున్సిపల్‌ సిబ్బంది యంత్రాలతో అక్కడికి చేరుకుని ఆక్రమణగా గుర్తించిన నిర్మాణాలను తొలగించారు. ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించే విధంగా ప్రభుత్వ, మున్సిపల్‌ స్థలాలు, రహదారులు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. కాగా పట్టణంలో రహదారులు, ఫుట్‌పాత్‌లు, ప్రభుత్వ, మున్సిపల్‌ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement