సర్పంచ్‌ల హక్కులను పరిరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ల హక్కులను పరిరక్షించాలి

Sep 10 2026 1:21 AM | Updated on Sep 10 2026 1:21 AM

జనగామ: గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు విడుదల చేయడంతో పాటు సర్పంచుల హక్కులను పరిరక్షించాలని కోరుతూ జిల్లా సర్పంచుల ఫో రం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలోని వివిధ గ్రామాల సర్పంచులు కలిసి తమ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు అత్యంత చేరువగా పనిచేసే ప్రజాప్రతినిధులు సర్పంచులేనని, గ్రామంలో ఏ సమస్య తలెత్తినా ప్రజలు తొలుత సర్పంచులను ఆశ్రయిస్తారన్నారు. అయితే గ్రామాల అభివృద్ధికి బాధ్యత వహిస్తున్న సర్పంచులకు తగిన అధికారాలు, నిధులు, విధుల్లో ప్రాధాన్యం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పెండింగ్‌ నిధులను విడుదల చేసి, సర్పంచ్‌లకు రావాల్సిన హక్కులు కల్పించాలన్నారు. తమ వినతిపై ప్రభుత్వం, జిల్లా అధికారులు సానుకూలంగా స్పందించి సమస్యలను త్వరగా పరిష్కరిస్తారని సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

కలెక్టర్‌కు జిల్లా సర్పంచ్‌ల ఫోరం వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement