ధిక్కార స్వరం ‘కాళోజీ’ | - | Sakshi
Sakshi News home page

ధిక్కార స్వరం ‘కాళోజీ’

Sep 9 2026 3:04 AM | Updated on Sep 9 2026 3:04 AM

ధిక్కార స్వరం ‘కాళోజీ’ – వివరాలు 8లోu 50ఏళ్ల నుంచి కత్తెర పంట

12 వరకు ప్రత్యేక కార్యాచరణ

సమన్వయంతో పనిచేయాలి

7

తన భావాలకే కాదు శరీరానికీ మరణం

లేదని నిరూపించిన వ్యక్తి కాళోజీ. నిజాం పాలన వ్యతిరేక ఉద్యమం, తదనంతరం తొలి, మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించిన అక్షర యోధుడు. ప్రజల భాషలో ఉండే ఆయన కవితలు.. పూర్తిగా తెలంగాణ మాండలికంతో సాగే రచనలు జనాల గుండెలను అలల తాకేవి. నేడు ఆయన జయంతి. తెలంగాణ భాషా దినోత్సవం కూడా.

విపత్తు నివారణకు ప్రణాళిక

జనగామ రూరల్‌: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మున్సిపల్‌, ఎయిడెడ్‌, ప్రైవేట్‌, కేజీబీవీ, మోడల్‌, రెసిడెన్షియల్‌ తదితర పాఠశాలల్లో స్కూల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ రూపొందించి, విద్యార్థులకు అవగాహనతో పాటు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నారు. ఈమేరకు ఇటీవల జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ చైర్మన్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. పీజీఐడీలో జిల్లా రాష్ట్రంలో 600కు 383 స్కోర్‌తో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలువగా, స్కూల్‌ సేఫ్టీ అండ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అంశంలో మరింత మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈనెల 12 వరకు రోజువారీగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మిషన్‌ శిఖరం (పీజీఐడీ 2.0) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 771 పాఠశాలల్లో ఈనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు 100 శాతం ఎస్డీఎంపీ ప్రక్రియ పూర్తి చేసేలా కృషి చేస్తున్నారు.

పాఠశాలలో చేపట్టాల్సిన చర్యలు

ప్రతీ పాఠశాలలో స్కూల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు అవగాహన, హెచ్చరికలు, తరలింపు, సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ, ఫైర్‌ సేఫ్టీ, ఫస్ట్‌ ఎయిడ్‌, ట్రాన్స్‌పోర్ట్‌ సేఫ్టీ, సైట్‌ సెక్యూరిటీకి సంబంధించిన ఏడు టాస్క్‌ఫోర్సులు ఏర్పాటు చేయనున్నారు. ఉపాధ్యాయులు, సీనియర్‌ విద్యార్థులతో కలిసి తరగతి గదులు, కారిడార్లు, మెట్లు, వంటగది, మరుగుదొడ్లు, ఆటస్థలం, ప్రహరీ, గేట్లు తదితర ప్రాంతాల్లో నాన్‌–స్ట్రక్చరల్‌ హజార్డ్‌ హంట్‌ నిర్వహించి, ప్రమాదకర అంశాలను వెంటనే తొలగించడం మరమ్మతుల కోసం నమోదు చేపట్టనున్నారు.

భద్రతపై ప్రత్యేక దృష్టి

పాఠశాల భవనాలు, ప్రహరీల్లో పగుళ్లు, పైకప్పు వంగడం, తేమ, ఇనుప రాడ్లు బయటకు కనిపించడం, గోడలు వాలడం వంటి నిర్మాణపరమైన లోపాలు గుర్తించిన వెంటనే అదే రోజు ఎంఈఓకు నివేదించనున్నారు. ప్రతీ పాఠశాలలో ఎవాక్యుయేషన్‌ మ్యాప్‌, అసెంబ్లీ పాయింట్‌, అత్యవసర ఫోన్‌ నంబర్లను స్పష్టంగా ప్రదర్శించాలి.

ఎంఈఓలకు ప్రత్యేక బాధ్యతలు

ప్రతీ ఎంఈఓ రోజుకు కనీసం ఐదు పాఠశాలలను, అందులో ప్రైవేట్‌, రెసిడెన్షియల్‌ పాఠశాలలను కూ డా సందర్శించి అమలును పరిశీలించాలి. విపత్తు నిర్వహణ చట్టం–2005లోని సెక్షన్‌ 30(2)(వీ), ప్రకారం సంబంధిత శాఖలకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. ప్రతీ పాఠశాలలో పోలీస్‌ స్టేషన్‌, బీట్‌ అధికారుల ఫోన్‌ నంబర్లు ప్రదర్శించేలా, అగ్నిమాపక శాఖ అధికారులు ప్రతీ స్కూల్‌ కాంప్లెక్స్‌లో కనీసం ఒక మాక్‌ డ్రిల్‌ నిర్వహించి, ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్ల తనిఖీతో పాటు వంటశాలలు, హాస్టళ్లలో అగ్ని భద్రతపై సూచనలు ఇవ్వాలి.

నాగారం గ్రామానికి చెందిన రైతు ఆలేటి మోహన్‌న్‌రెడ్డి తనకున్న తొమ్మిది ఎకరాల్లో మూడు ఎకరాల్లో కత్తెర, ఆరు ఎకరాల్లో వానాకాలం వరి సాగు చేస్తున్నారు. మే 24న నాట్లు వేసిన కత్తెర పంటకు ప్రస్తుతం నీటి వసతి బాగుంది. కాలువ, చెరువు నీటితో పాటు రెండు బోర్లను వినియోగిస్తున్నారు. ఇబ్బందులు ఎదురైనా పైపుల ద్వారా నీరందిస్తున్నారు. మూడు ఎకరాల్లో సుమారు 120 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా. రెండు రోజుల క్రితం క్వింటాల్‌కు రూ.2,321 ధరకు మార్కెట్‌లో విక్రయించారు. మొత్తం రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. 50 ఏళ్లుగా కత్తెర సాగు చేస్తున్న మోహన్‌రెడ్డి, ఏప్రిల్‌ చివరి వారంలో సాగు పనులు ప్రారంభిస్తారు. వానాకాలం వరి కోతలు ప్రారంభమయ్యేలోపే కత్తెర పంటను విక్రయించుకుంటామని తెలిపారు.

ఉద్యమాలతో

ముడిపడిన జీవితం

నిరంతరం

పోరాటాల బాటే..

నేడు ప్రజాకవి జయంతి

పాఠశాలల భద్రతకు అత్యంత ప్రాధాన్యం

100 శాతం రక్షణ ఉండేలా

కార్యాచరణ

12 వరకు కార్యక్రమాలు

ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌

సందీప్‌ కుమార్‌ ఝా

8న టాస్క్‌ఫోర్సుల ఏర్పాటు, హజార్డ్‌ హంట్‌ ప్రారంభం

9న హజార్డ్‌ హంట్‌ పూర్తి

10న అవగాహన కార్యక్రమాలు, మాక్‌ డ్రిల్స్‌

11న చేపట్టాల్సిన కార్యక్రమాలకు ఎస్‌ఎంసీ ఆమోదం, ఎంఈఓ పరిశీలన

12 అన్ని పాఠశాలల హార్డ్‌ కాపీల సమర్పణ యూడైస్‌లో నమోదు

ప్రకృతి విపత్తులపై విద్యార్థులకు తప్పనిసరిగా అవగాహన ఉండేలా అన్ని ఽశాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలి. నిర్ధేశించిన లక్ష్యాలు గడువులోగా పూర్తి చేసి 100 శాతం కార్యక్రమాలు చేపట్టాలి. స్కూల్‌ సేఫ్టీ అండ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అంశంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలి.

–సందీప్‌ కుమార్‌ ఝా, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement