కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కామర్స్ అండ్ బిజినెస్‌మేనేజ్‌మెంట్ విభాగాధిపతిగా ఆ విభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కనకయ్య నియమితులయ్యారు. సోమవారం ఈమేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఒక సంవత్సరంపాటు విధులు నిర్వర్తించనున్నారు. ప్రిన్సిపాల్ ఉత్తర్వుల కాపీని కనకయ్యకు అందించారు. కార్యక్రమంలో ఆ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రెహమాన్, ఫ్యాకల్టీ క్లబ్ చైర్మన్ డాక్టర్ డి.భిక్షపతి, వర్కింగ్ చైర్మన్ డాక్టర్ ఫిరోజ్‌పాషా, అధ్యాపకులు కనకయ్యను అభినందించారు.


