బచ్చన్నపేట: మండలం కట్కూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయురాలు, చిట్టి చిలుకమ్మా..గేయరచయిత బళ్ల సరస్వతి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని న్యూజెర్సీ ఎన్‌ఏపీఏ (నార్త్ అమెరికన్ పద్మశాలి అసోసియేషన్) సంస్థ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. ఈసందర్భంగా ఆమె కుమారులు బళ్ల శ్రీనివాస్, కట్కూర్ సర్పంచ్ బళ్ల రవీంద్రనాథ్ సోమవారం మాట్లాడుతూ.. ఈ నెల 12న అవార్డు అందించనున్నట్లు చెప్పారు. కాగా, శ్రీచిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా..శ్రీ అనే గేయం ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశంగా ముద్రితమైన సంగతి తెలిసిందే.


