జనగామ: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు బయలుదేరిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీలు, తదితరులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జిల్లాకేంద్రంలోని చౌరస్తాలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పెద్దఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించా రు. మహిళా ఎమ్మెల్యేలను అవమానించేలా వ్యవహరించారని ఆరోపిస్తూ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్దె సిద్ధిలింగం, ఇర్రి రమణారెడ్డి, ఎనగందుల కృష్ణ, మల్లిగారి రాజు, ఉడుగుల కిష్టయ్య, సువార్త, బిజ్జాల నవీన్, సమ్మర్, ధర్మపురి శ్రీనివాస్, ఉల్లెంగుల సందీప్, సుగుణాకర్ గౌడ్, సువార్త అనిల్, గునిగంటి రామకృష్ణ, సజ్జ దుర్గాప్రసాద్, ప్రమోద్ రెడ్డి, ఎల్లయ్య, ప్రతాప్‌రెడ్డి, నర్సింగ్, యాదగిరి గౌడ్ తదితరుల ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు చౌరస్తాలో బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచి పోయింది. సీఐ సత్యనారా యణరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు భరత్, చెన్నకేశవులు, రతీష్ తదితరులతో పాటు పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్ శ్రేణులను అరెస్టు చేశారు. బలవంతంగా బస్సులు, పోలీసు వాహనాల్లో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో వాహనాలను శ్రేణులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అరెస్టు కాని కార్యకర్తలు పోలీసులు తీసుకెళ్తున్న వాహనాల వెంట స్టేషన్ వరకు పరుగులు తీసి అక్కడా బైఠాయించారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినదించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అరైస్టెన వారి పేర్లు నమోదు చేసుకుని సొంత పూచీకత్తుపై విడుదల చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ శ్రేణుల ఆగ్రహం
జిల్లాకేంద్రంలో ధర్నా, రాస్తారోకో
స్వల్ప ఉద్రిక్తత, నాయకుల అరెస్ట్,
అడ్డగింత


