తాతా మధును సస్పెండ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

తాతా మధును సస్పెండ్‌ చేయాలి

Sep 8 2026 1:17 AM | Updated on Sep 8 2026 1:17 AM

స్పీకర్‌పై వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్‌ ధర్నా

కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం

జనగామ: స్పీకర్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వరంగల్‌–హైదరాబాద్‌ హైవేపై ధర్నా నిర్వహించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్‌ను అవమానించడం అంటే రాజ్యాంగాన్ని, శాసనసభ గౌరవాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను అ వమానించడమేనని అన్నారు. తాతా మధుపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, ఆయనను వెంటనే సస్పెండ్‌ చేసి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ దళితుడు కావడం వల్లే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీకి రావడం లేదని ఆరోపించారు. వైటీడీఏ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మీనారాయణ నాయక్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ పాలనలో దళితులకు తగిన న్యాయం జరగలేదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వేమళ్ల సత్యనారాయణరెడ్డి, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కంచ రాములు, జనగామ పట్టణ అధ్యక్షుడు దోర్నాల వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు వేముల మల్లేష్‌, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు బడికె ఇందిర, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మాజిద్‌ అప్సర్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్‌, కళ్యాణం చంద్రమౌళి, డీసీసీ స్పోక్స్‌పర్సన్‌న్‌ నరేందర్‌ పవార్‌, జనరల్‌ సెక్రటరీ భాస్కర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement