స్టేషన్‌ఘన్‌పూర్: పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే జీఓ 97ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని టీపీ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ యాదయ్య డిమాండ్ చేశారు. జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్‌ఘన్‌పూర్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు వినూత్నరీతిలో చేతిలో గడ్డపార, పార, తట్టలను పట్టుకుని సోమవారం నిరసన తెలిపారు. అదేవిధంగా పాలిటెక్నిక్ విద్యార్థులు కళాశాల నుంచి శివునిపల్లి–జఫర్‌గఢ్ బీటీ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్య సాంకేతిక విద్య అని, కార్మిక విద్య కాదని, అందుకే గడ్డపార, తట్ట, పారలతో నిరసన తెలిపామన్నారు. విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడవద్దని, దశాబ్దాలుగా రాష్ట్రంలో సాంకేతిక నిపుణులను తయారు చేస్తున్న పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను మరోశాఖ పరిధిలోకి తీసుకెళ్లడంతో విద్యార్థుల భవిష్యత్‌పై అనిశ్చితి ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు టి.అశోక్, సుదర్శన్‌రెడ్డి, సంపత్‌కుమార్, అనీల్‌కుమార్, ధనుంజయ్, శ్రీకర్, రాజు, సుకన్య, శ్రీధర్‌రెడ్డి, జావేద్‌పాషా, నరేష్, ప్రశాంత్, రామనర్సయ్య, సిద్దులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గడ్డపార, తట్ట చేతబట్టి పాలిటెక్నిక్
అధ్యాపకులు వినూత్న నిరసన


