చేయూతకు వెల్లువలా | - | Sakshi
Sakshi News home page

చేయూతకు వెల్లువలా

Sep 7 2026 2:56 AM | Updated on Sep 7 2026 2:56 AM

కొత్త పింఛన్లకు భారీసంఖ్యలో దరఖాస్తులు

ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా వచ్చినవి 10,115

15వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ

ప్రతీ మండలానికి 5 లాగిన్‌లు

ఆన్‌లైన్‌కు సర్టిఫికేషన్‌ తప్పనిసరి కాదు

జనగామ రూరల్‌: ఏళ్ల తరబడి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితరుల అవస్థలు తీరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందించే పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఈనేపథ్యంలో కొత్త పింఛన్‌ కోసం ఆశావహులు పెద్దసంఖ్యలో దరఖాస్తు చేస్తున్నారు. ఆసరా కోసం ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 10,115 దరఖాస్తులు అందాయి. ఈ నెల 15న అర్జీల స్వీకరణ అవకాశం ఉండడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. గ్రామాలు, పట్టణాల్లో అర్హుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. వచ్చిన వాటిని రోజువారీగా ఎంపీడీఓ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. అర్హతలను పరిశీలించిన తర్వాత తదుపరి ప్రక్రియ చేపడుతున్నారు. కాగా, ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకొనేవారు సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేదు. అయితే పింఛన్లకు ఎంపికై తే సంబంధిత సర్టిఫికెట్‌ చూపించాల్సి ఉంటుంది. జిల్లాలో శనివారం నాటికి 10,115 మంది చేయూత కింద దరఖాస్తు చేసుకుంటే అందులో నియోజకవర్గాల వారీగా చూస్తే స్టేషన్‌ ఘన్‌పూర్‌లో అత్యధికంగా 4,562, జనగామ నియోజకవర్గంలో 2929, పాలకుర్తిలో 2622 దరఖాస్తులు వచ్చాయి.

మండలానికి 5 లాగిన్‌లు

అర్హులైన వారు చేయూత పెన్షన్‌ పొందడానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండగా ప్రతీ మండలానికి ఎంపీడీఓ లాగిన్‌లో అధికారికంగా 5 లాగిన్‌లు ప్రభుత్వం కల్పించింది. అలాగే మున్సి పాలిటీకి 5 ఇచ్చారు. వచ్చిన ప్రతీ దరఖాస్తు వివరాలు మండలాల్లో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, మున్సిపాలిటీలో సంబంధిత అధికారులతో ఆన్‌లైన్‌ ప్రక్రియ చేపడుతున్నారు. అయితే గతంలో ఆన్‌లైన్‌ నమోదుకు తప్పనిసరిగా సర్టిఫికేషన్‌ ఉండగా ప్రస్తుతం ఆ విధానాన్ని సడలించారు. ప్రాథమిక సమాచారంతో నమోదు చేసుకోని అభ్యర్థుల ఎంపిక సమయంలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌లో చూపించే అవకాశం కల్పించారు. అలాగే లబ్ధిదారులు తాము ఆన్‌లైన్‌ చేసిన వివరాలు చూసుకోవడానికి కామన్‌ లాగిన్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో దరఖాస్తులో తప్పులు దొర్లే అవకాశం ఉండదు. ఈనెల 15 వరకు గడువు ఉండడంతో అధికారులు గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు వివరిస్తున్నారు.

లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు

● వితంతువులు: 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఉండాలి.

● ఒంటరి మహిళలు: వివాహిత మహిళలకు 18 ఏళ్లు నిండి ఉండాలి. భర్త నుంచి విడిపోయి లేదా భర్త వదిలేసిన పరిస్థితిలో ఉండాలి. విడిపోయిన కాలం ఏడాదికిపైగా ఉండాలి. అవివాహిత మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో 30, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లు నిండి ఉండాలి. పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అధికారి ధ్రువీకరణ అవసరం.

● గీత కార్మికులు: 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. బాడీ ట్యాపర్‌ కోఆపరేటివ్‌ సొసైటీ సభ్యత్వం, ఎకై ్సజ్‌ శాఖ ధ్రువీకరణ పత్రం అవసరం,

● చేనేత కార్మికులు : 50 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. హ్యాండ్లూమ్స్‌, టెక్స్‌టైల్స్‌ శాఖ ధ్రువీకరణ తప్పనిసరి.

● దివ్యాంగులు: వయసుతో సంబంధం లేదు. కనీసం 40 శాతం అంగవైకల్యం ఉండాలి. వినికిడి లోపం ఉన్నవారికి 51 శాతం అంగవైకల్యం అవసరం. యూడీఐడీ లేదా సదరం ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.

● ఫైలేరియా బాధితులు: వయసుతో సంబంధం లేదు. గ్రేడ్‌–2, గ్రేడ్‌–3 బాధితులు అర్హులు. డీఎంహెచ్‌ఓ ధ్రువీకరణ ఆవసరం.

● డయాలసిస్‌ రోగులు: వయసుతో సంబంధం లేదు. దయాలసిస్‌ చికిత్స పొందుతున్నవారు అర్హులు. ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ద్వారా నమోదు, ధ్రువీకరణ అవపరం.

మండలాల వారీగా ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు

1219

1080

903

849

829

819

777

735

635

613

స్టేషన్‌ ఘన్‌పూర్‌

మున్సిపాలిటీ

574

తరిగొప్పుల

రఘునాథపల్లి

437

జనగామ మున్సిపాలిటీ

లింగాల ఘణపురం

స్టేషన్‌ ఘన్‌పూర్‌

బచ్చన్నపేట

దేవరుప్పుల

పాలకుర్తి

జనగామ

చిల్పూర్‌

కొడకండ్ల

జఫర్‌గఢ్‌

నర్మెట

320

325

సద్వినియోగం చేసుకోవాలి

చేయూత పింఛన్‌కు దరఖాస్తు చేసుకునేవారు ఈనెల 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ ఉంటుంది. లబ్ధిదారులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు అదుబాటులో ఉంచుకోవాలి.

–సతీష్‌, డీపీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement